e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News హోలీ ఆడ‌నివ్వ‌లేద‌ని అవ్వ‌ను చంపేశారు

హోలీ ఆడ‌నివ్వ‌లేద‌ని అవ్వ‌ను చంపేశారు

హోలీ ఆడ‌నివ్వ‌లేద‌ని అవ్వ‌ను చంపేశారు

ల‌క్నో : హోలీ పండుగ ఆ ఇంట‌ విషాదాన్ని నింపింది. త‌న ఇంటి ముందు హోలీ ఆడొద్ద‌ని చెప్పినందుకు ఓ అవ్వ‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాది చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎత‌వా జిల్లా మేవ‌తి టోలా ఏరియాలో సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

ఓ 60 ఏళ్ల వృద్ధురాలు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జీవిస్తోంది. హోలీ పండుగ నేప‌థ్యంలో ఆ వృద్ధురాలి ఇంటి ముందు కొంద‌రు యువ‌కులు హోలీ ఆడారు. త‌న ఇంటి ముందు హోలీ ఆడొద్దు అని ఆ యువ‌కుల‌ను ముస‌లావిడ ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన ఆ యువ‌కులు వృద్ధురాలితో పాటు కుటుంబ స‌భ్యుల‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేశారు.

వారి దాడిలో వృద్ధురాలి చ‌నిపోయింది. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. దాడికి పాల్ప‌డ్డ యువ‌కులంద‌రూ మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


ఏక్డిల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న మ‌రో యువ‌కుడు.. ట్రాక్ట‌ర్‌ను అతివేగంగా న‌డ‌ప‌డంతో పాద‌చారుల‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్ట‌డంతో ట్రాక్ట‌ర్ కూడా ధ్వంస‌మైంది. ట్రాక్ట‌ర్‌ను న‌డిపిన యువ‌కుడిని స్థానికులు పోలీసుల‌కు అప్ప‌గించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

నాగార్జున‌ సాగ‌ర్‌లో బీజేపీ చతి‌కిల!

పగలు కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు..

నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ

ఆధార్‌ లింక్‌ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హోలీ ఆడ‌నివ్వ‌లేద‌ని అవ్వ‌ను చంపేశారు

ట్రెండింగ్‌

Advertisement