నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
సాగర్‌లో బీజేపీ చతికిల | నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకొనేందుకు బీజేపీ పాట్లు పడుతున్నది. ఇక్కడ ఆ పార్టీకి క్యాడర్, లీడర్

అభ్యర్థి ప్రకటనతోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకొనేందుకు బీజేపీ పాట్లు పడుతున్నది. ఇక్కడ ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేకపోవడంతో టీఆర్ఎస్ అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలని మొదటినుంచి ఎదురుచూసింది. టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డికి టికెట్ రాకపోతే కాషాయ కండువా కప్పుకుంటారని ఆశపడింది.
కానీ, సీఎం కేసీఆర్ రాజకీయ చతురతను ప్రదర్శించి దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు మంగళవారం బీ–ఫారం ఇచ్చారు. టికెట్ ఆశించిన చిన్నపరెడ్డి, కోటిరెడ్డికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో భగత్‌కు తమ మద్దతు ప్రకటించారు. దీంతో అయోమయంలో పడిన బీజేపీ.. చివరకు పానుగోతు రవికుమార్‌ను సోమవారం రాత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఎవరో కూడా నియోజకవర్గం ప్రజలకు తెలిదని స్థానికులు అంటున్నారు.
2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయమంటూ డబ్బా కొట్టుకొంటున్న కాషాయ పార్టీకి ఉప ఎన్నికలో అభ్యర్థిని వెతుక్కోవటం గగనంగా మారటం గమనార్హం. 2018 ఎన్నికల్లో ఇక్కడ చిన్న పల్లెలో ఉన్నన్ని ఓట్లుకూడా పొందలేకపోయిన బీజేపీకి ఈసారి ఆ మాత్రం కూడా రావని నాగార్జునసాగర్ నియోజకవర్గ రాజకీయాలపై అనుభవం ఉన్న నేతలు అంటున్నారు. అభ్యర్థి ప్రకటనతోనే ఆ పార్టీ ఓటమిని పరోక్షంగా అంగీకరించిందని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

