కరకగూడెం, ఆగస్టు 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని నవోదయ విద్యాలయంలో శనివారం విద్యార్ధులు ‘ ఏక్ పెడ్ మా కే నామ్’ అనే కార్యక్రమంలో భాగంగా తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు. తమ తల్లులతో కలిసి విద్యార్థులు పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు. ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు మొక్కలు నాటి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఎన్వీ ప్రిన్సిపాల్ రత్నయ్య మాట్లాడారు. పర్యావరణాన్ని రక్షించడానికి, అలాగే తల్లుల గౌరవాన్ని పెంచే విధంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మొక్కలు నాటామని, నాటిన చెట్లను తల్లికి గౌరవంగా పెంచే విధంగా, హరితవానాలుగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నవోదయ విద్యాలయంలో ‘ ఏక్ పెడ్ మా కే నామ్’