Karnataka Congress MLA resigns | కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గం లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
Karnataka Congress MLA resigns | కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గాన్ని చేర్చకపోవడంపై కార్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
బెంగళూరు: కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గాన్ని చేర్చకపోవడంపై కార్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. (Karnataka Congress MLA resigns) కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన ఇండి నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ తన పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేశారు. ఫలితం లేకపోవడంతో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన ఎమ్మెల్యే సభ్యత్వానికి యశ్వంతరాయగౌడ పాటిల్ రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ జి.ఎస్. పాటిల్‌కు తన రాజీనామా లేఖను ఆయన పంపారు.
కాగా, ఖరీఫ్ సీజన్లో ఇండి తాలూకా తీవ్ర కరువు బారిన పడిందని యశ్వంతరాయగౌడ పాటిల్ తెలిపారు. కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆగస్ట్ 28న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. అయితే విజయపుర జిల్లాలోని 13 తాలూకాలలో ఇప్పటి వరకు 11 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని, కేవలం ఇండి, చడచన్ తాలూకాలను మాత్రమే మినహాయించారని ఆయన విమర్శించారు.
అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభావవంతమైన వ్యక్తులకు, ఒత్తిడి తెచ్చే పద్ధతులను అనుసరించే వారికే ప్రాధాన్యత లభిస్తోందని యశ్వంతరాయగౌడ పాటిల్ ఆరోపించారు. ‘అందువల్ల, నా నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నందున, నేను స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’ అని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.
మరోవైపు సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో యశ్వంతరాయగౌడ పాటిల్ గతంలో ఆగస్ట్ 3న కూడా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే పార్టీ నాయకత్వం నచ్చజెప్పడంతో దానిని ఉపసంహరించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

