NRI BRS UK | దాస్యం వినయ్ భాస్కర్‌పై దాడి ఆందోళన కలిగించే విషయం : ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యదర్శి మాదిరెడ్డి నవీన్ రెడ్డి
NRI BRS UK | వరంగల్‌లోని MGM ఆసుపత్రిలో రోగులను పరామర్శించేందుకు వెళ్లిన దాస్యం వినయ్ భాస్కర్‌ను, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం వారిపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యదర్శి మాదిరెడ్డి నవీన్ రెడ్డి అన్నారు.
NRI BRS UK | లండన్, సెప్టెంబర్ 23 : వరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ పై జరిగిన పోలీసుల దాడిని, అక్రమ కేసులను, అలాగే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యదర్శి మాదిరెడ్డి నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఇటీవల వరంగల్‌లోని MGM ఆసుపత్రిలో రోగులను పరామర్శించేందుకు వెళ్లిన దాస్యం వినయ్ భాస్కర్‌ను, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం వారిపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు.
ఈ ఘటనలో వినయ్ భాస్కర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లిన మాజీ ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం, ఆయనతో దురుసుగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగించే పరిణామం. పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా, చట్టం ప్రకారం నిష్పక్షపాతంగా పనిచేయాలి’ అని మాదిరెడ్డి నవీన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదు చేయడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ అని, అలాంటి ప్రశ్నలను అణచివేసేందుకు పోలీసు కేసులను ఉపయోగించకూడదని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సింది ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కానీ, పోలీసు కేసులు, అరెస్టులు, బెదిరింపుల ద్వారా కాదని’ మాదిరెడ్డి నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, రైతులు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రతిపక్ష నాయకులపై కేసులు, పోలీసు చర్యలతో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీయడం సరికాదని అన్నారు.‘బీఆర్ఎస్ నాయకులపై ఉద్దేశపూర్వకంగా లేదా రాజకీయ కక్షతో కేసులు నమోదు చేస్తున్నారని, వాటిపై స్వతంత్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, ప్రతి కేసును ఆధారాలతో మరియు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని, ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నవీన్ రెడ్డి అన్నారు.
Read Also :
UDP MLAs Join BJP | 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. మేఘాలయలో రెండో అతి పార్టీగా గుర్తింపు
యువత రాజకీయాల్లోకి రావాలి : బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్
BJP in-charges | రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఎవరంటే
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

