యువత రాజకీయాల్లోకి రావాలి : బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్
గ్రామీణ యువత రాజకీయాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ పిలుపునిచ్చారు.
కుభీర్ : గ్రామీణ యువత రాజకీయాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని బీఆర్ఎస్ ( BRS ) ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ (Kiran Komrevar ) పిలుపునిచ్చారు. బుధవారం కుభీర్ మండలం నిగ్వా గ్రామంలో పర్యటించిన సందర్భంగా స్థానిక సర్పంచ్, కుభీర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెంచు రమేష్ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు.
ఆయన మాట్లాడుతూ యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టి, సాగునీటి వనరులను వినియోగిం చుకునేలా రైతులకు భరోసా కల్పించామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దొంతుల దేవిదాస్, రమేష్, తోట సుదర్శన్ , బీఆర్ఎస్ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

