UDP MLAs Join BJP | 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. మేఘాలయలో రెండో అతి పార్టీగా గుర్తింపు
UDP MLAs Join BJP | మేఘాలయలోని అధికార కూటమిలో రాజకీయ సమీకరణలు మారాయి. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ)కి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో యూడీపీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు.
షిల్లాంగ్: మేఘాలయలోని అధికార కూటమిలో రాజకీయ సమీకరణలు మారాయి. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ)కి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో యూడీపీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. (UDP MLAs Join BJP) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా సమక్షంలో శాసనసభ్యులైన లాఖ్మెన్ రింబుయ్ (అమ్లారెమ్), మాజీ మంత్రి కిర్మెన్ షిల్లా (ఖ్లీహ్రియత్), ఓలన్ సింగ్ సుయిన్ (మావ్సిన్రామ్), మాథ్యూ బియాండ్స్టార్ కుర్బా (మావ్ఫ్లాంగ్), మైరల్బోర్న్ సియెమ్ (నాంగ్పో), పియస్ మార్వీన్ (రానికోర్), సిన్షార్ థాబా (సోహియాంగ్), బాలాజీద్ సిన్రెమ్ (షెల్లా) ఆ పార్టీలో చేరారు.
కాగా, 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని అధికార కూటమిలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి 26 మంది, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ)కు 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి కేవలం ఇద్దరు మాత్రమే శాసన సభ్యులున్నారు.
అయితే తాజాగా 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 10కి చేరింది. మేఘాలయలో రెండో అతి పెద్ద పార్టీగా అది అవతరించింది. అధికార కూటమిలో రాజకీయ సమీకరణలు మారడంతో 2028 అసెంబ్లీ ఎన్నికలపై ఇది ప్రభావం చూపే అవకాశమున్నది.
8 MLAs from the UDP have joined the BJP family in presence of Union Minister @KirenRijiju ji. 🪷🔥
With this, BJP’s strength in the Meghalaya Assembly RISES FROM 2 TO 10!
A significant political development for Meghalaya and the Northeast. 🇮🇳 pic.twitter.com/12vFytnFBD
— Sunny Raj (@SunnyRajBJP) September 23, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 2nd Largest
- BJP
- join
- Meghalaya
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

