KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. కేటీఆర్ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మా గణేశుడిని మొక్కుకున్నది ఒక్కటే.. తెలంగాణ అంతటా, భారతదేశమంతటా సమృద్ధిగా వర్షాలు పడాలే. రైతులు బాగుండాలే.. హైదరాబాద్లో అందరూ కూడా కులాలు, మతాలు, వర్గాలన్నింటికీ అతీతంగా కలిసి మెలిసి ఉండాలి. శాంతిభద్రతలు బాగుండాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి.. పండుగలు అప్పుడప్పుడు వస్తాయి.. కాబట్టి పండుగలప్పుడైనా అందరూ కలిసికట్టుగా పిల్లాపాపలతో, కుటుంబసభ్యులతో బాగుండాలని కోరుకుంటున్నా. జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై.. అంటూ ముగించారు.
కేటీఆర్ వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేటీఆర్ వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. pic.twitter.com/9EGyiDebAK
— BRS Party (@BRSparty) September 23, 2026
UDP MLAs Join BJP | 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. మేఘాలయలో రెండో అతి పార్టీగా గుర్తింపు
యువత రాజకీయాల్లోకి రావాలి : బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్
BJP in-charges | రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఎవరంటే