బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంగా హిందీలో తెరకెక్కిన పింక్ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో హోలీ సందర్బంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న చందాన రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుంది.
ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ను ఎక్కువగా ఎలివేట్ చేయని చిత్ర బృందం కేవలం కథపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. అయినప్పటికీ వకీల్ సాబ్ ట్రైలర్ 24 గంటలలోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసింది. అంతేకాదు 8 లక్షల లైకులు మార్క్‌ను సెట్ చేసి 1 మిలియన్స్ లైక్స్‌ను అందుకునేందుకు పరుగులు పెడుతుంది. పవన్ కం బ్యాక్‌తో టాలీవుడ్లో రికార్డులు చెదిరిపోతున్నాయి. ట్రైలరే ఈ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే సినిమా ఇంకెన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహించగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

