e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News ‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల

‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల

‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల

చిరంజీవి సినిమా అంటే అభిమానులు ముందుగా కోరుకునేది డాన్సులు. అవి ఉంటేనే చిరు సినిమా అవుతుంది. ఆ తర్వాతే యాక్షన్ అయినా.. కామెడీ అయినా.. ఎంటర్ టైన్మెంట్ అయినా. అలాంటి వింటేజ్ చిరంజీవిని చూసి చాలా రోజులు అయిపోయింది. ఖైదీ నెం 150 తర్వాత చేసిన సైరాలో అలాంటివేం లేవు. ఈ సినిమాలో డాన్సులు చేయలేదు చిరు. కథ ప్రకారం చాలా హూందాగా కనిపించాడు. దాంతో ఇప్పుడు ఆచార్య సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఓ ప్రోమో విడుదలైంది. లాహే లాహే సాంగ్ ప్రోమో చూసిన తర్వాత చిరు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అసలు అన్నయ్య వయసు 65 ఉంటుందా అంటూ మనకు మనమే ప్రశ్నలు వేసుకుంటున్నారు. విడుదలైంది ఒక్క స్టెప్పు అయినా కూడా అందులో చిరు కనిపించిన విధానం చూసి వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
15 సెకన్ల వీడియో ఇప్పుడు చిరు ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ వస్తుందా అని వేచి చూసేలా చేస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌, టీజర్ కంటే కూడా ఇప్పుడు విడుదలైన లాహే లాహే సాంగ్ ప్రోమో లో చిరు కొత్తగా ఉన్నాడు. మాస్ చిరు కనిపిస్తున్నాడు. ఈ 15 సెకన్ల టీజర్‌తోనే అన్నింటికి సమాధానాలు ఇచ్చేశాడు దర్శకుడు కొరటాల శివ.

ఆచార్యలో డాన్సులకు కొదవ ఉండదని ఇప్పుడు ప్రోమో చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది. లాహే లాహే అంటూ సాగే తొలి పాటను మార్చి 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. దానికి ఒక్కరోజు ముందే చిన్న ప్రోమోను రిలీజ్ చేసి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. టీజర్‌లో అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మణిశర్మ.. ఇప్పుడు తొలిపాటకు కూడా అంతే ఊపిచ్చే ట్యూన్ ఇచ్చాడని ప్రోమోతో అర్థమైపోతుంది.
గతంలో చిరుకు ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు మణిశర్మ. ఇప్పుడు ఆచార్యకు కూడా ఇదే చేసుంటాడని నమ్ముతున్నారు అభిమానులు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో డాన్సులు, కామెడీ ఉండవని ఫిక్స్ అయిపోయిన వాళ్లకు ఈ పాట సమాధానంగా మారిపోయింది. ఖైదీ నెం 150లో తనదైన స్టెప్పులతో పిచ్చెక్కించిన మెగాస్టార్.. ఆచార్యలోనూ అదే చేయబోతున్నాడు.

- Advertisement -

65 ఏళ్ల వయసులో అన్నయ్య ఎలా డాన్సులు చేసుంటారు అనే ప్రశ్నకు సమాధానం చిన్న స్టెప్ తోనే వచ్చేసింది. ఈ పాట కోసమే అప్పట్లో భారీ సెట్ కూడా వేశారు. అప్పట్లో దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటను చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. మొత్తానికి చూడాలిక.. లాహే లాహే ఏం చేయబోతుందో..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డంపై ఇస్మార్ట్ భామ ఏమ‌న్న‌దంటే..?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్‌ స్టంట్‌: క్రిష్

బాహుబ‌లి రికార్డ్ బ్రేక్ చేసిన వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్

చిన్నారితో బాల‌కృష్ణ హోలీ సెల‌బ్రేష‌న్స్..స్టిల్ వైర‌ల్‌

జాన్వీక‌పూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ

కాలేజీకి వెళ్లలేదు..ల‌వ్‌స్టోరీలు క‌నెక్ట్ కావు : రానా

ల‌వ్ స్టోరీ విడుద‌ల వాయిదా..? మేక‌ర్స్ క్లారిటీ

రామ్‌సేతులో అక్ష‌య్ కుమార్ లుక్ ఇదేనా ?

కారు ప్ర‌మాదంలో యువ గాయ‌కుడు మృతి

భ‌న్సాలీపై అలిగిన దీపికా.. కార‌ణం అదేనా?

‘వైల్డ్ డాగ్’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉండ‌బోతుంది?

రెండు సాంప్ర‌‌దాయాల‌లో మెహ్రీన్ కౌర్ వివాహం..!

పొట్టి దుస్తుల‌లో అన‌సూయ హోలీ సంబురాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల
‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల
‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల

ట్రెండింగ్‌

Advertisement