సినిమా హీరోయిన్స్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న బుల్లితెర యాంకర్ అనసూయ. టీవీ షోస్, సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచే అనసూయ హోలీ సందర్భంగా పొట్టి బట్టలు ధరించి తన ఫ్యామిలీతో ఈ వేడుక ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.
అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో కలిసి సందడి చేస్తోంది. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలొ రూపొందుతున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. అలానే మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఈ క్రమంలో అనసూయ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక తాజాగా మలయాళంలో కూడా ఆమెకు ఓ సినిమా అవకాశం దక్కింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైన ఆమె.. మరోవైపు మోహన్ లాల్ హీరోగా రానున్న ఓ సినిమాలో నటించేందుకు సిద్దమైనట్టు సమాచారం.