‘వైల్డ్ డాగ్’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉండబోతుంది?

విడుదలకు మూడు రోజుల ముందు సెన్సార్ పూర్తి చేసుకుంది నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రం. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అహిషోర్ సోలమన్ దర్శకుడు. నాగార్జున కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం 32వ సారి కావడం గమనార్హం. గతంలో మహర్షి ఇలాంటి సినిమాలకు పని చేసిన సోలోమన్ చెప్పిన కథ నచ్చి వైల్డ్ డాగ్ చేసాడు నాగార్జున. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు బాగానే పెంచేశాయి. ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. యాక్షన్ కాస్త అధికంగా ఉండడంతో యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
కాశ్మీర్ ప్రాంతంలో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రాణంగా నిలుస్తాయని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చింది. సినిమాలో పాటలు ఉండవని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆసక్తికరంగా సినిమా సాగుతుందని తెలుస్తోంది. దాంతోపాటు టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి కథ తీసుకున్నారని.. ఆ పాయింట్ చుట్టూ బోర్ కొట్టకుండా మంచి స్క్రీన్ ప్లేతో ముందుకు వెళ్లిందని తెలుస్తోంది. సినిమా కమర్షియల్ గా ఎంతవరకు ఆడుతుంది అనేది పక్కన పెడితే కచ్చితంగా నాగార్జున కెరీర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందనే ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
యాక్షన్ సినిమా కాబట్టి ఓపెనింగ్ తక్కువగా ఉండొచ్చని.. ఒకవేళ కనెక్ట్ అయితే కచ్చితంగా మంచి విజయం సాధించే అవకాశం ఉందని సెన్సార్ వర్గాల నుంచి తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ చాలా బాగుందని టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో NIA ఏజెంట్ గా నటించాడు నాగార్జున. రొటీన్ సినిమాలు చేసి చేసి బోర్ కొట్టి ఇలాంటి ఒక కొత్త సబ్జెక్ట్ ఎంచుకున్నానని ప్రమోషన్లో చెబుతున్నాడు నాగార్జున. మరి ఈ సినిమాలో ఆ కొత్తదనం ఉందా లేదా అనేది చూడాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

