చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్

పైకి కనిపించడు కాదు లోపల మాత్రం బాలయ్యలో చిన్న పిల్లాడు దాగుతున్నాడు. అది అప్పుడప్పుడూ బయటికి వస్తుంటాడు. ఈయన గురించి బాగా తెలిసిన వాళ్లు కూడా ఇదే మాట చెప్తుంటారు. బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వం అందుకే కోపంతో ఏమైనా అన్నా కూడా వెంటనే దగ్గరికి తీసుకుంటాడు అని చెప్తుంటారు. ఇప్పుడు ఈయన హోలీ సంబరాలు కూడా ఇలాగే చిన్న పిల్లాడిలా చేసుకున్నాడు. ఓ చిన్నపాపతో ఈయన హోలీ జరుపుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.
అందులో పాప చెంపకు రంగు రాస్తూ బాలయ్య ఇచ్చిన పోజు అదిరిపోయింది. ఇది చూసి మురిసిపోతున్నారు అభిమానులు. మరోవైపు అందులో బాలయ్య లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బోయపాటి సినిమా కోసమే ఈ లుక్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య ఈ ఒక్క సినిమానే చేస్తున్నాడు కాబట్టి లుక్ కూడా ఇదే సినిమాలో ఉంటుందని అర్థమైపోతుంది.ఈ సినిమాలో అఘోరా అవతారం ఎత్తాడు బాలయ్య. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలో అఘోరా పాత్ర చేస్తున్నాడని బోయపాటి కూడా ఖరారు చేసాడు. ఈ పాత్రపై సపరేట్ ఫోకస్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. మొన్నటి వరకు BB3 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. మార్చి నాలుగో వారం నుంచి అఘోరా పాత్రపై అక్కడే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నాడు దర్శకుడు బోయపాటి.
ఈ సినిమాలో ఇంటర్వెల్ టైమ్‌కు అఘోరా పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. అక్కడ్నుంచి అఘోరాగా బాలయ్య చేసే అద్భుతాలు చూడాల్సిందే కానీ చెప్పలేం అంటున్నారు మేకర్స్. పక్కా కమర్షియల్ మాస్ ఫార్ములాతోనే వస్తున్న ఈ సినిమాలో అఘోరాగా ఉండే పాయింట్ బోయపాటి ఎక్కడ పెట్టాడో తెలియదు కానీ దానిపై మాత్రం నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. ఈ రెండు పాత్రల కోసం ఫిజికల్‌గానూ చాలా కష్టపడ్డాడు నందమూరి నటసింహం. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆర్ఎఫ్సీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అఘోరా పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చివరి వరకు కూడా సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది.
మరి ఇంతటి అంచనాలు పెంచేస్తున్న బోయపాటి.. సినిమాలో ఎలా చూపించబోతున్నాడనేది మరింత ఆసక్తికంగా మారిపోయింది. ఈ అఘోరా పాత్ర కోసమే తెల్లగడ్డంతో బాలయ్య కనిపించబోతున్నాడని.. ఆ లుక్ ఇదేనని తెలుస్తుంది. BB3 సినిమాను ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న విడుదల చేయనున్నారు. గతంలో బోయపాటితో జయ జానకీ నాయకా సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

