నాంపల్లి, ఆగస్టు 08 : నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామానికి చెందిన మండల పెద్దులు కుమార్తె ప్రణీత బోనాల పండుగ సందర్భంగా నూతనంగా చిత్రీకరించిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. అదేవిధంగా ప్రణీత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీతని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దామెర సహదేవ్, ఉప సర్పంచ్ కాటబోయిన శంకరయ్య, మండల పెద్దులు, గాజుల హరిబాబు, నక్క శ్రీనివాసులు, మంటిపెళ్లి శివకుమార్, వల్లపు పర్వతాలు, సిరిపంగి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.