Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటింటా రంగులరంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. మహిళలు నూతన పట్టు వస్త్రాలు ధరించి బతుకమ్మలను ఎత్తుకుని వేదికల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.
Bathukamma : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటింటా రంగులరంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. మహిళలు నూతన పట్టు వస్త్రాలు ధరించి బతుకమ్మలను ఎత్తుకుని వేదికల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. పట్టణాల్లో వాడవాడలు, రాష్ట్రంలోని పల్లెలన్నీ బతుకమ్మ డీజే పాటలతో మార్మోగాయి.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అన్ని జిల్లాల్లో బతుకమ్మ సందడితో కళకళలాడాయి. నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో అంగరంగవైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. శాళీగౌరారం మండలం అంబారీపేట గ్రామంలో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్లో కాలనీలన్నీ బతుకమ్మ సంబరాల్లో మునిగితేలాయి. పర్వతాపూర్ గ్రామం పరిధిలోని సాయిప్రియ కాలనీలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఇంటింటా పేర్చిన బతుకమ్మలను ఐదో రోడ్డులోని పెద్దమ్మ తల్లి ఆలయం ముంగిటకు చేర్చి ఆడుకున్నారు. ఆటపాటలతో సందడి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

