Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Lal Hit Janata Party | కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి వ్యతిరేకంగా మరో వేదిక ఏర్పడింది. లాల్ హిట్ జనతా పార్టీ (ఎల్జేపీ) పేరుతో కొత్త సమూహం లాంచ్ అయ్యింది. ఆదివారం ఢిల్లీలోని మాల్వీయ స్మృతి భవన్లో మొదటి సభ్యత్వ సమావేశాన్ని నిర్వహించింది.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి వ్యతిరేకంగా మరో వేదిక ఏర్పడింది. లాల్ హిట్ జనతా పార్టీ (ఎల్జేపీ) పేరుతో కొత్త సమూహం లాంచ్ అయ్యింది. ఆదివారం ఢిల్లీలోని మాల్వీయ స్మృతి భవన్లో మొదటి సభ్యత్వ సమావేశాన్ని నిర్వహించింది. (Lal Hit Janata Party) ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ‘లాల్ హిట్ జనతా పార్టీ’ని ఏర్పాటు చేసినట్లు దాని అధినేత అయాన్ భట్నాగర్ తెలిపారు. సీజేపీ, కాంగ్రెస్, నిరసనకారులను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. వారి నిరసన ప్రదర్శనలు దేశ రాజ్యాంగ సంస్థలను ప్రశ్నించాయని, వ్యాపారాలకు తీవ్ర నష్టం కలిగించాయని ఆయన ఆరోపించారు.
కాగా, తమ బృందం భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించడానికి, తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించగలమని నిరూపించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అయాన్ భట్నాగర్ తెలిపారు. ప్రధాని మోదీ జన సమీకరణకు పిలుపునిస్తే ఎంత మంది గుమిగూడతారోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దసరా పండుగ అత్యంత కీలకమైన వ్యాపార సీజన్ అని అన్నారు. ఢిల్లీతో సహా పలు మహానగరాల్లో నిరసనకారులు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో అంతరాయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా సీజేపీ, కాంగ్రెస్ నిరసనలకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ‘ప్రభుత్వ మార్పు’ గురించి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను భట్నాగర్ ఖండించారు. ఈ నిరసనలు ప్రభుత్వ మార్పును ఎలా తీసుకువస్తాయని ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేయడం రాజ్యాంగ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని విమర్శించారు. ఈ రోజు సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తుంటే, రేపు ప్రధాని మోదీ రాజీనామా డిమాండ్ కూడా రావచ్చని అన్నారు. కేవలం 50,000 మంది ప్రజలు గుమిగూడారన్న కారణంతో ఒక వర్గం డిమాండ్లను అంగీకరించలేమని ఆయన అన్నారు.
అలాగే సీజేపీ చేపడుతున్న నిరసనలు పోలీసు వ్యవస్థ, ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే జరుగుతున్నాయని భట్నాగర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) నుంచి సీజేపీకి మద్దతు లభిస్తోందని ఆయన విమర్శించారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అంతం దసరా రోజున మొదలవుతుందని భట్నాగర్ హెచ్చరించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
Lal Hit Janta Party in response to CJP 😂 https://t.co/VHnpFgYQvJ
— Masked Man (@MaskedMan1947) October 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

