Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. టైగర్ వాహనంపై కాల్పులు జరిపారు.
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. టైగర్ వాహనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై కారులో ఉన్నవారు అప్రమత్తం కావడంతో టైగర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన కారు డ్రైవర్‌తో పాటు, మరో ఆటో డ్రైవర్ గాయపడ్డారు.
ఈ ఘటనపై జుహు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పుల స్పందించిన ముంబై పోలీసులు.. టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి తూటా గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు పోస్ట్
ఈ కాల్పుల ఘటనకు పాల్పడింది తామేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పబడుతున్న వ్యక్తుల పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. అనిల్ పండిట్, అనిల్ హర్మన్ సంధు ఈ దాడి వెనుక ఉన్నారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మేము అతడికి ఫోన్ చేసి విషయం వివరించడానికి ప్రయత్నించాం. కానీ అతడు అర్థం చేసుకోలేదు. అందుకే ఈరోజు అతడికి సరైన రీతిలో వివరించాం” అనే అర్థం వచ్చేలా ఆ పోస్ట్‌లో వ్యాఖ్యలు ఉన్నాయి. ముంబై చిత్ర పరిశ్రమలో తమ మాట వినని వారు లేదా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే వారు తదుపరి లక్ష్యమవుతారని ఆ పోస్ట్‌లో బెదిరించినట్లు సమాచారం. ఈ బెదిరింపు నేపథ్యంలో బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, కాల్పులకు గల కారణాలు, దాడి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని అంశాలు వెల్లడికావాల్సి ఉంది.
2014లో బాలీవుడ్ ఎంట్రీ
టైగర్ ష్రాఫ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు. 2014లో ‘హీరోపంతి’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లతో గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన నటించిన ‘బాఘీ 4’లో సంజయ్ దత్, సోనమ్ బజ్వా, హర్నాజ్ సంధు తదితరులు నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

