Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Motorola | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా (Motorola) మరో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు లీకుల ద్వారా వార్తల్లో నిలిచిన ఈ ఫోన్ పేరు తాజాగా వెల్లడైంది.
Motorola | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా (Motorola) మరో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు లీకుల ద్వారా వార్తల్లో నిలిచిన ఈ ఫోన్ పేరు తాజాగా వెల్లడైంది. మోటరోలా రేజర్ ఫ్లెక్స్ 2027 (Motorola Razr Flex 2027) పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ ఫోల్డింగ్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరాలతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం.
ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ (Evan Blass) ఎక్స్ (X) వేదికగా మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ పేరును సూచించే వివరాలను షేర్ చేశారు. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి తీసినట్లుగా కనిపిస్తున్న స్క్రీన్‌షాట్‌ను ఆయన పోస్ట్ చేశారు. అందులో Motorola Razr Flex 2027 అనే పేరు కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ మోటరోలా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో లేదు. కంపెనీ కూడా ఫోన్ పేరును, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
గతంలో ఈ ఫోన్‌ను కేవలం Razr Flex పేరుతో విడుదల చేయవచ్చని ప్రచారం జరిగింది. తాజాగా 2027 పేరుతో కొత్త లీక్ రావడం ఆసక్తికరంగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్లో విడుదల చేసే అవకాశం ఉందని గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
6.92 ఇంచుల ఫోల్డింగ్ డిస్ప్లే
లీకుల ప్రకారం Motorola Razr Flex 2027 ఫోన్లో 6.92 ఇంచుల ఇంటర్నల్ OLED ఫోల్డింగ్ డిస్ప్లే ఉండనుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయవచ్చని సమాచారం. ఫోన్ బయటివైపు 4.97 ఇంచుల కవర్ డిస్ప్లేను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ సాధారణ పొడవైన ఫోల్డబుల్ ఫోన్లకు భిన్నంగా వెడల్పైన బుక్-స్టైల్ డిజైన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ల తరహాలో దీని డిజైన్ ఉండొచ్చని అంచనా.
Snapdragon 8 Gen 5 ప్రాసెసర్
పనితీరు పరంగా ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. అలాగే 12GB ర్యామ్ అందించే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేయవచ్చని సమాచారం. అయితే స్టోరేజ్ వేరియంట్ల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
50MP కెమెరాలు.. 5,000mAh బ్యాటరీ
కెమెరాల విషయానికి వస్తే.. మోటరోలా రేజర్ ఫ్లెక్స్ 2027 వెనుకవైపు రెండు కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో రెండూ 50 మెగాపిక్సెల్ సెన్సార్లుగా ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5,000mAhగా ఉండొచ్చని సమాచారం. ఇక డార్క్ బొటానికల్ గార్డెన్, కొరియాండర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రావచ్చని లీకులు వెల్లడిస్తున్నాయి.
IP48, IP49 రేటింగ్స్ కూడా?
ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు IP48, IP49 రేటింగ్స్ ఉండవచ్చని గత నివేదికలు పేర్కొన్నాయి. ఇవి దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు లభించే రక్షణ స్థాయులను సూచిస్తాయి. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీపై మోటరోలా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

