ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు
ప్రియాంక మోహన్ | ఒక్కసారి ఐరన్ లెగ్ ముద్ర పడిందంటే వాళ్ల వైపు చూడ్డానికి కూడా మన దర్శకులు ఆలోచిస్తుంటారు. కానీ దర్శకులు మాత్రం ఈమె వెంటనే పడుతున్నారు.

ఒక్కసారి ఐరన్ లెగ్ ముద్ర పడిందంటే వాళ్ల వైపు చూడ్డానికి కూడా మన దర్శకులు ఆలోచిస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం దీనికి మినహాయింపు ఉంటారు. వాళ్లకు ప్లాపులు వచ్చినా కూడా వాళ్ల వైపే చూస్తుంటారు నిర్మాతలు. దర్శకులు కూడా ఆ ముద్దుగుమ్మల డేట్స్ కోసం పాకులాడుతుంటారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు ప్రియాంక అరుల్ మోహన్. ఈమె తెలుగులో నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా దర్శకులు నిర్మాతలు మాత్రం ఈమె వెంటనే పడుతున్నారు.

గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. గ్రేట్ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఈమెను ఎంపిక చేశాడు. నిజానికి గ్యాంగ్ లీడర్ సినిమాకు ఆయనే సినిమాటోగ్రఫీ అందించాల్సి ఉన్నా కూడా అనుకోని పరిస్థితుల్లో ఆయన శిష్యుడు పని చేశాడు. అయితే హీరోయిన్ కోసం విక్రమ్ కే కుమార్ వెతుకుతున్న సమయంలో ప్రియాంక ఫోటోలను అతడికి చూపించి ఓకే చేయించాడు. ఆ సినిమాలో ప్రియాంక సెటిల్డ్ నటనతో బాగానే ఆకట్టుకుంది.

ఈ మధ్యే శ్రీకారం సినిమాతో వచ్చింది ఈ భామ. వచ్చానంటివో పోతానంటివో పాటలో నడుము అందాలతో బాగానే మాయ చేసింది ప్రియాంక. అయితే శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. సినిమా బాగానే ఉన్నా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం ఈమె తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న డాక్టర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇందులో కూడా క్యూట్ పోజులతో మాయ చేస్తుంది ఈ భామ. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా ప్రియాంక చేతుల్లో ఉన్నాయి. వరసగా ఫ్లాపులు వస్తున్నా కూడా ప్రియాంక వైపు మాత్రం మనోళ్లు చూడటం ఆపడం లేదు.

ఇప్పుడు తెలుగులో ఈమెకు వరస అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కుర్ర హీరోలు ఈమెతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రామ్, నాని, నాగ చైతన్య లాంటి హీరోలతో ప్రియాంక అరుల్ మోహన్ సినిమాలు చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. ఫ్లాపులు వచ్చినా కూడా ఈమె నటనపై ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. అందుకే అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు తమిళనాట కూడా ఈమెకు పాపులారిటీ బాగానే పెరిగిపోయింది. మొత్తానికి హిట్స్ లేకుండానే ఇంతగా రెచ్చిపోతుంది ప్రియాంక.. ఒక్కసారి అది కూడా వచ్చిందంటే పట్టుకోవడం సాధ్యం కూడా కాదేమో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్: క్రిష్
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్
చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
లవ్ స్టోరీ విడుదల వాయిదా..? మేకర్స్ క్లారిటీ
రామ్‌సేతులో అక్షయ్ కుమార్ లుక్ ఇదేనా ?
కారు ప్రమాదంలో యువ గాయకుడు మృతి
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
‘వైల్డ్ డాగ్’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉండబోతుంది?
రెండు సాంప్రదాయాలలో మెహ్రీన్ కౌర్ వివాహం..!
పొట్టి దుస్తులలో అనసూయ హోలీ సంబురాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

