చండీగఢ్: ఒక ఖైదీ పారిపోయే ప్రయత్నంలో పోలీస్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ నేపథ్యంలో అతడ్ని నిలువరించేందుకు ఎస్కార్ట్ పోలీస్ ప్రయత్నించాడు. చివరకు పోలీస్ కాల్పుల్లో ఆ ఖైదీ మరణించాడు. (Prisoner shot dead) పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఖైదీ నసీబ్ సింగ్‌పై హత్య, హత్యాయత్నం, ఎన్డిపిఎస్ చట్టం కింద నేరాలతో సహా ఏడు క్రిమినల్ కేసులున్నాయి. జైలులో ఉన్న అతడితో పాటు మరో ఇద్దరు ఖైదీలను వైద్య పరీక్షల కోసం శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కాగా, వైద్య పరీక్షల తర్వాత శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైదీలను ఆటోలో తిరిగి జైలుకు పోలీసులు తరలిస్తుండగా తప్పించుకుని పారిపోయేందుకు నసీబ్ సింగ్ ప్రయత్నించాడు. చేతికి సంకెళ్లు వేసి పట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ కానిస్టేబుల్ ప్రతిఘటించగా రోడ్డుపై పడిన వారిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు నుంచి సర్వీస్ రివాల్వర్ లాక్కొనేందుకు నసీబ్ సింగ్ ప్రయత్నించాడు. చివరకు పోలీస్ కాల్పుల్లో అతడు మరణించాడు.
మరోవైపు ఈ సంఘటనలో కానిస్టేబుల్ జస్దీప్ సింగ్ ముఖం, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరణించిన ఖైదీ నసీబ్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే పారిపోయేందుకు పోలీస్తో ఖైదీ పెనుగులాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Dramatic CCTV footage: A Prisoner suddenly attacks a policeman with a knife while being escorted to the Court. The officer dodges and wrestles him, shows amazing restraint BUT finally he had no choice – one shot fired and the man is dead… pic.twitter.com/5RYcikjBxV
— Mihir Jha (@MihirkJha) May 17, 2026