సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది అందాల భామ సారా అలీఖాన్. ఈ బ్యూటీ ఎప్పుడు, ఎలాంటి డ్రెస్‌లో కనిపిస్తుందే చెప్పడం కష్టమే. పంజాబీ డ్రెస్, షార్ట్ డ్రెస్, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ సందడి చేసే సారా ఈ సారి స్కై బ్లూ (నీలాకాశం రంగు) డ్రెస్‌లో మెరిసిపోయింది.
66 ఫిలిం ఫేర్ అవార్డుల కోసం ఆడ్నేవిక్ డిజైన్ చేసిన నీలిరంగు గౌన్‌లో సిల్వర్ సాండల్స్, రింగ్స్ పెట్టుకుని గార్జియస్ లుక్‌లో కనిపిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ సిండరెల్లా స్టోరీ అంటూ క్యాప్షన్ ఐకాన్స్, ఎమోజీలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్, ధనుష్ తో కలిసి అట్రాంగి రే సినిమా చేస్తోంది సారా అలీఖాన్. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.