శ్రీనగర్: ఒక ప్రదర్శన ప్రారంభోత్సవానికి జాతీయ జెండా రంగులతో కూడిన రిబ్బన్ ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) దీనిని గమనించారు. ‘మువ్వన్నెల’ రిబ్బన్ కత్తిరించేందుకు ఆయన నిరాకరించారు. రెండు వైపుల నుంచి ఆ రిబ్బన్‌ను జాగ్రత్తగా తొలగించాలని సూచించారు. శ్రీనగర్‌లోని కశ్మీర్ హాట్లో ‘చేతివృత్తులు, చేతికళల’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. బుధవారం దీనిని ప్రారంభించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా అక్కడకు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి, ఇతర నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు.
కాగా, ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన రిబ్బన్ భారతీయ జెండాను పోలిన మూడు రంగులతో ఉండటాన్ని ఒమర్ అబ్దుల్లా గమనించారు. దీంతో దానిని కత్తిరించబోనని ఆయన చెప్పారు. ఆ రిబ్బన్‌ను రెండు వైపుల నుంచి తొలగించి భద్రపరచాలని అధికారులు, నిర్వాహకులకు ఆయన సూచించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఒమర్ అబ్దుల్లా తీరు, సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసించారు. ‘పరిస్థితిని నిశితంగా గ్రహించి, సరిదిద్దే చర్యలు తీసుకున్నందుకు సీఎం ఒమర్ అబ్దుల్లాకు అభినందనలు’ అని ఒకరు కొనియాడారు.
అయితే తరచుగా చౌకబారు టీవీ చర్చలకు ‘దేశభక్తిని’ పరిమితం చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి చేతలే మాటల కన్నా ఎక్కువగా మాట్లాడతాయి’ అని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత గగన్ భగత్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాగా, కటింగ్ కోసం ‘మువ్వన్నెల’ రిబ్బన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులపై కొందరు మండిపడ్డారు.
#WATCH | Srinagar | Jammu & Kashmir CM Omar Abdullah refuses to cut a tricoloured inaugural ribbon to mark the official opening of the two-day Handicrafts & Handloom Exhibition, instead asks the organisers to remove it and keep it safely pic.twitter.com/d2o6kYzKH2
— ANI (@ANI) April 15, 2026
Also Read:
Girl Gives Birth | 14 ఏళ్ల బాలిక ప్రసవం.. దీనికి కారణమైన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు
Students Hospitalised | మధ్యాహ్న భోజనం తిని.. విద్యార్థిని మృతి, వంద మందికిపైగా ఆసుపత్రిలో చేరిక