Girl Gives Birth | 14 ఏళ్ల బాలిక ప్రసవం.. దీనికి కారణమైన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు
Girl Gives Birth | నిండు గర్భిణీ అయిన బాలిక ప్రసవ వేదనతో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నది. బాలిక పరిస్థితిని గమనించిన పిల్లల సంక్షేమ సంఘం, కాన్పు కోసం ఆమెకు సహకరించింది. దీంతో ఆ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నవజాత శిశువు తండ్రిపై కేసు నమోదు చేశారు.
డెహ్రాడూన్: నిండు గర్భిణీ అయిన బాలిక ప్రసవ వేదనతో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నది. బాలిక పరిస్థితిని గమనించిన పిల్లల సంక్షేమ సంఘం, కాన్పు కోసం ఆమెకు సహకరించింది. దీంతో ఆ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నవజాత శిశువు తండ్రిపై కేసు నమోదు చేశారు. (Girl Gives Birth) ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 14 ఏళ్ల వయస్సున్న బాలిక తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే విడిపోయారు. గత ఏడాది ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో అతడితో కలిసి పూణే వెళ్లింది. అక్కడ గర్భం దాల్చిన ఆ బాలిక పితోరాగఢ్కు తిరిగి వచ్చింది.
కాగా, నిండు గర్భిణీ అయిన ఆ బాలికకు మంగళవారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె చేరుకున్నది. ఈ విషయం తెలుసుకున్న పిల్లల సంరక్షణ కమిటీ ఛైర్మన్, సభ్యులు ఆ హాస్పిటల్కు చేరుకున్నారు. ఆ బాలిక తీవ్రమైన ప్రసవ వేదనతో బాధపడటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో ఆ బాలికకు గార్డియన్గా ఆ కమిటీ బాధ్యత వహించింది. అవసరమైన సమ్మతి పత్రాలపై సంతకాలు చేసింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కాన్పు చేశారు. ఆ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
మరోవైపు పిల్లల సంరక్షణ కమిటీ దీనిపై మున్సియారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నవజాత శిశువుకు తండ్రైన యువకుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ బాలిక, నవజాత శిశువును ఒక ప్రత్యేక దత్తత కేంద్రంలో ఉంచుతామని పిల్లల సంరక్షణ కమిటీ తెలిపింది. ఆ బాలికకు 18 ఏళ్లు నిండే వరకు అక్కడ ఉంచి తగిన సంరక్షణ, మద్దతు ఇస్తామని పేర్కొంది.
Also Read:
Students Hospitalised | మధ్యాహ్న భోజనం తిని.. విద్యార్థిని మృతి, వంద మందికిపైగా ఆసుపత్రిలో చేరిక
Woman Elopes With Lover | ప్రియుడితో పారిపోయిన మహిళ.. విషమిచ్చి చంపిన అత్తింటి కుటుంబం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Case filed
- Father
- Girl
- Gives Birth
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

