Woman Elopes With Lover | ప్రియుడితో పారిపోయిన మహిళ.. విషమిచ్చి చంపిన అత్తింటి కుటుంబం
Woman Elopes With Lover | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె ఆచూకీని వారు గుర్తించారు. గుట్టుగా ఒక చోటకు తీసుకెళ్లారు. విషం ఇచ్చి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేశారు. ప్రియుడి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది.
బెంగళూరు: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె ఆచూకీని వారు గుర్తించారు. గుట్టుగా ఒక చోటకు తీసుకెళ్లారు. విషం ఇచ్చి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేశారు. ప్రియుడి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. (Woman Elopes With Lover) కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుకేరికి చెందిన సత్యవ్వకు సంతోష్ హెలవితో నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే ప్రియుడు కృష్ణ పాటిల్‌తో వివాహేతర సంబంధాన్ని ఆమె కొనసాగించింది.
కాగా, ఫిబ్రవరిలో ప్రియుడు కృష్ణతో కలిసి సత్యవ్వ పారిపోయింది. దీంతో ఆమె అత్తింటి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారిద్దరూ కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు అత్తింటి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో సత్యవ్వకు నచ్చజెప్పి ఆమెను వెనక్కి తెచ్చారు.
మరోవైపు ప్రియుడితో సత్యవ్వ పారిపోయి తమ కుటుంబానికి పరువునష్టం కలిగించిందని అత్తింటి వారు కలతచెందారు. ఈ నేపథ్యంలో ఆమెను మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ప్రియుడు కృష్ణతో సంబంధాన్ని ముగించాలని చెప్పారు. నిరాకరించిన ఆమె కృష్ణ వద్దకు వెళ్తానని చెప్పింది.
దీంతో ఆగ్రహించిన అత్తింటి కుటుంబ సభ్యులు మార్చి 21న సత్యవ్వతో బలవంతంగా విషం తాగించి హత్య చేశారు. కర్ణాటక సరిహద్దు సమీపంలోని మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఒక శ్మశానవాటికలో ఆమె మృతదేహాన్ని దహనం చేశారు.
అయితే సత్యవ్వను ప్రియుడు కృష్ణ సంప్రదించలేకపోయాడు. దీంతో ఆమె గురించి ఆందోళన చెందిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేయగా ‘పరువు హత్య’ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులైన 46 ఏళ్ల ప్రకాష్ భీమప్ప, 35 ఏళ్ల షానూర్ సదాశివ, 40 ఏళ్ల కల్లప్ప మయప్పను అరెస్ట్ చేశారు. వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
girl duped by lover | ఇంట్లో చోరీకి బాలికను ప్రేరేపించిన ప్రియుడు.. ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్‌రేప్
Two grooms arrive for one bride | ఒకే వధువును పెళ్లాడేందుకు ఇద్దరు వరులు రాక.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

