girl duped by lover | ఇంట్లో చోరీకి బాలికను ప్రేరేపించిన ప్రియుడు.. ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్‌రేప్
girl duped by lover | ఇంట్లో చోరీ కోసం బాలికను ఆమె ప్రియుడు ప్రేరేపించాడు. నగలు, డబ్బుతో పారిపోదామని నమ్మించాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి నుంచి తెచ్చిన నగలు, డబ్బుతో పారిపోయాడు.
లక్నో: ఇంట్లో చోరీ కోసం బాలికను ఆమె ప్రియుడు ప్రేరేపించాడు. నగలు, డబ్బుతో పారిపోదామని నమ్మించాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి నుంచి తెచ్చిన నగలు, డబ్బుతో పారిపోయాడు. (girl duped by lover) ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి నివసిస్తున్నది. ఆమె తండ్రి దుబాయ్‌లో పని చేస్తున్నాడు.
కాగా, టిటు పాల్ అనే యువకుడు ఆ బాలికకు పరిచయమయ్యాడు. గత ఆరు నెలలుగా వారిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి నగలు, డబ్బు తీసుకొస్తే ఇద్దరం కలిసి పారిపోయి పెళ్లి చేసుకుందామని ఆమెను నమ్మించాడు. ఏప్రిల్ 5న ఆ బాలికను టిటు పాల్ కలిశాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. దానిని ఆహారంలో కలిపితే ఆమె కుటుంబ సభ్యులు మత్తులోకి జారుకుంటారని చెప్పాడు.
మరోవైపు ఆ బాలిక అదే రోజు రాత్రి ఆ మత్తు మందును ఆహారంలో కలిపింది. కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లోని బంగారు, వెండి నగలతోపాటు రూ.10,000 తీసుకున్నది. ఆ రాత్రి వేళ టిటు పాల్ ఆ బాలిక ఇంటికి చేరుకున్నాడు. తన స్నేహితులు దగ్గరలో ఉన్నారని, వారిని కలిసిన తర్వాత పారిపోదామని ఆమెకు చెప్పాడు. ఆ బాలికను ఒక రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక వద్ద ఉన్న నగలు, డబ్బు తీసుకుని వారు పారిపోయారు.
అక్కడి నుంచి బయటపడిన ఆ బాలిక తన ఇంటికి చేరుకున్నది. జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పగా పోలీసులకు ఆమె సమాచారం ఇచ్చింది. దీంతో పోలీస్ సిబ్బంది, అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
నిందితులైన టిటు పాల్, ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు. పరారీలో ఉన్న మరో నిందితుడి వద్ద నగలు, డబ్బు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే హరిద్వార్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేసే టిటు పాల్‌కు నేర చరిత్ర ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై ఆరు కేసులు నమోదైనట్లు చెప్పారు. టిటు పాల్ నేర చరిత్ర గురించి తెలియని ఆ బాలిక అతడి పరిచయం వల్ల మోసపోయినట్లు వెల్లడించారు.
Also Read:
Gujarat Leader | మూడు పార్టీల తరపున నామినేషన్ దాఖలు.. చివరకు బీజేపీ వైపు మొగ్గు
Students Kidnapped Classmate | విలాసవంత జీవితం కోసం.. క్లాస్‌మేట్‌ను కిడ్నాప్ చేసిన విద్యార్థులు
Two grooms arrive for one bride | ఒకే వధువును పెళ్లాడేందుకు ఇద్దరు వరులు రాక.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

