Panchayat Elections | ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
Panchayat Elections | ఆంధ్రప్రదేశ్ లో గురువారం జరుగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో గురువారం జరుగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల ( Panchayat Elections) పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 26 జిల్లాల్లో 709 పంచాయతీలు ఏకగ్రీవాలు మినహా మిగతా 3,240 పంచాయతీల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగనుంది. ఎన్నికల నిర్వహణకు గాను బుధవారం ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో చేరుకున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాల్టీలు, నగర పంచాయతీ లకు కూడా గురువారం పోలింగ్ జరుగనుంది. రాజమహేంద్రవరం , మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లకు నాలుగు మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకుగాను 11.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు.
19 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు చైర్పర్సన్ కోసం 134 మంది పోటీ పడుతుండగా 707 కౌన్సిలర్ స్థానాల కోసం 2,057 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని వెల్లడించారు. ఈనెల 30న ఎన్నికల ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat Elections | ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : ఆర్.జె.సి.కృష్ణ
Vitamin B1 | దేశంలో గర్భిణుల్లో పెరుగుతున్న విటమిన్ బి1 లోపం.. దీంతో ఏమవుతుంది.. నిపుణులు ఏమంటున్నారు..?
మురుగునీటితో రోడ్డుపై నరకం.. వెంగన్నపాలెం గ్రామస్తుల ఆందోళన
‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలం మార్చాలి’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

