మురుగునీటితో రోడ్డుపై నరకం.. వెంగన్నపాలెం గ్రామస్తుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిచెట్టు బజార్లో మురుగునీటి సమస్యపై గ్రామస్తులు బుధవారం ఆందోళన నిర్వహించారు. 33 అడుగుల వెడల్పు గల రహదారి ఆక్రమణకు గురికావడంతో పాటు...
– ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్
- అధికారుల హామీతో నిరసన విరమణ
జూలూరుపాడు, నవంబర్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిచెట్టు బజార్లో మురుగునీటి సమస్యపై గ్రామస్తులు బుధవారం ఆందోళన నిర్వహించారు. 33 అడుగుల వెడల్పు గల రహదారి ఆక్రమణకు గురికావడంతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపైనే మురుగునీరు నిల్వ ఉంటోందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వాటర్ ప్లాంట్ నుండి వచ్చే నీటితో పాటు, ఇళ్లలో వాడుకునే నీరు, సైడ్ డ్రైనేజీలోని మురుగునీరు నేరుగా రోడ్డుపైకి ప్రవహిస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మార్గంలో వాహనదారులు వెళ్తున్న సమయంలో మురుగునీరు చిమ్మి బట్టలపై పడుతోందని, పాదచారులు నిత్యం బురద నీటిలోనే నడవాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు ఆక్రమణలను తొలగించి, వెడల్పు చేయడంతో పాటు శాశ్వత డ్రైనేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంపీఓ తులసీరామ్, సర్పంచ్ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. రోడ్డుపైకి మురుగునీరు రాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురుగునీటితో రోడ్డుపై నరకం.. వెంగన్నపాలెం గ్రామస్తుల ఆందోళన
‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలం మార్చాలి’
జిల్లా, రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ విద్యార్థినుల ఎంపిక
Watch: కోర్టు వద్ద హత్య కేసు నిందితుడి చేయి నరికివేత.. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తులు
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

