అహ్మదాబాద్: మూడు పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ తరుఫున ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరకు బీజేపీ వైపు ఆయన మొగ్గుచూపారు. ఈ మేరకు ఆ పార్టీ ‘ఫారం- బి’ని అధికారికంగా సమర్పించారు. దీంతో మిగతా రెండు పార్టీలు షాక్ అయ్యాయి. (Gujarat Leader) గుజరాత్‌లోని పైపెరో జిల్లా పంచాయతీ స్థానంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. భరత్ సింగ్ వఖాలా ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ మూడు పార్టీలు ఒకే వ్యక్తిని తమ అభ్యర్థిగా ఎంచుకోవడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి.
కాగా, మాజీ మంత్రి బచుభాయ్ ఖాబాద్ చొరవతో భరత్ సింగ్ వఖాలా చివరకు బీజేపీ వైపు మొగ్గుచూపారు. లాంఛనంగా ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ అందజేసిన ‘ఫారం- బి’ని అధికారికంగా సమర్పించారు. స్థానిక అభివృద్ధి, తన కార్యకర్తల డిమాండ్ కారణంగా తాను బీజేపీలోకి చేరినట్లు ఆయన తెలిపారు. ‘కాంగ్రెస్, ఆప్ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నా. అభివృద్ధి మార్గాన్ని నేను ఎంచుకున్నా, మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి అభివృద్ధిని ఎంచుకున్నా’ అని అన్నారు.
మరోవైపు దాహోద్ గిరిజన నాయకుడైన భరత్ సింగ్ వఖాలా గతంలో కాంగ్రెస్, ఆప్ తరుఫున అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్న ఆయన తాజాగా బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చింది. మూడు తాలూకా పంచాయతీ స్థానాలను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నది. కాంగ్రెస్, ఆప్ అభ్యర్థిగా ఆయన వైదొలగడంతో ఇప్పటి వరకు గందరగోళం నెలకొన్న ఆ పంచాయతీ స్థానం కూడా బీజేపీ కైవశం కానున్నది.
Also Read:
Two grooms arrive for one bride | ఒకే వధువును పెళ్లాడేందుకు ఇద్దరు వరులు రాక.. తర్వాత ఏం జరిగిందంటే?
Students Kidnapped Classmate | విలాసవంత జీవితం కోసం.. క్లాస్‌మేట్‌ను కిడ్నాప్ చేసిన విద్యార్థులు
Watch: క్లినిక్ షట్టర్లో ఇరుక్కుపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?