Watch: ఒక్క రోజు వయసున్న ఖడ్గమృగం పిల్ల.. అరుదైన వీడియో వైరల్
Rhino Baby | ఒక్క రోజు వయస్సున్న బుల్లి ఖడ్గమృగాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఒక జాతీయ పార్కులో తాజాగా జన్మించిన పిల్ల రైనో వీడియో క్లిప్‌ను ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: ఒక్క రోజు వయస్సున్న బుల్లి ఖడ్గమృగాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఒక జాతీయ పార్కులో తాజాగా జన్మించిన పిల్ల రైనో (Rhino Baby) వీడియో క్లిప్‌ను ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. వన్యప్రాణి ప్రేమికుల దృష్టిని ఇది ఎంతగానో ఆకర్షించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్, నవజాత ఖడ్గమృగం వీడియో క్లిప్‌ను బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒక్కరోజు వయస్సున్న బుల్లి రైనో బేబీని మీరు ఎప్పుడైనా చూశారా? అని అందులో పేర్కొన్నారు. జాతీయ పార్కులోని ప్రతి ఖడ్గమృగాన్ని రికార్డ్ చేయడంతోపాటు తాము పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు.
కాగా, అటవీ శాఖ సిబ్బంది తమ సాధారణ గస్తీ విధులు నిర్వహించినప్పుడు ఈ వీడియో క్లిప్‌ను రికార్డ్ చేసినట్లు ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తెలిపారు. ఖడ్గమృగం పిల్లలకు దగ్గరగా వెళ్లడం అత్యంత ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. అందుకే జంతువులకు ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచి దీనిని చిత్రీకరించినట్లు చెప్పారు. శిక్షణ పొందిన ఏనుగుపై నుంచి జూమ్ చేసి ఈ వీడియో రికార్డ్ చేసినట్లు ఆయన వివరించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అరుదైన బుల్లి రైనో బేబీ వీడియో వన్యప్రాణి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నది.
If you have never seen how a one day old rhino baby looks like.
In our national park every rhino is recorded and monitored. pic.twitter.com/U26W5J8OVC
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 15, 2026
Also Read:
Watch: ‘మువ్వన్నెల’ రిబ్బన్ కత్తిరించేందుకు ఒమర్ నిరాకరణ.. ఆయన ఏం చేశారంటే?
Girl Gives Birth | 14 ఏళ్ల బాలిక ప్రసవం.. దీనికి కారణమైన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు
Woman Elopes With Lover | ప్రియుడితో పారిపోయిన మహిళ.. విషమిచ్చి చంపిన అత్తింటి కుటుంబం
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

