Chennai Super Kings : ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు హోరాహోరీగా తలపడడం చూశాం. మైదానంలో ‘నువ్వానేనా’ అన్నట్టు ఆడే ఈ రెండు జట్ల మధ్య కొత్త రగడ మొదలైంది. ఆర్సీబీ సొంత మైదానంలో తమకు జరిగిన అవమానంపై చెన్నై ఫ్రాంచైజీ భగ్గుమంటోంది. చిన్నస్వామి స్టేడియంలో ‘ఇడ్లీ, దోసె, సాంబార్’ పాటతో తమను అవమానించారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి సీఎస్కే ఫిర్యాదు చేసింది. చిన్నస్వామి డీజేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరింది చెన్నై యాజమాన్యం.
లీగ్ దశలో భాగంగా ఏప్రిల్ 5న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు 250 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు తడబడ్డారు. అసలే ఓవైపు మ్యాచ్ చేజారుతున్న చెన్నై జట్టును ‘ఇడ్లీ, దోసె, సాంబార్, చట్నీ’ పాటతో మరింత విసిగించాడు డీజే. ఈ పాట ద్వారా దక్షిణాది సంప్రదాయాన్ని, తమను అవమానించారని సీఎస్కే యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.
🚨 CSK HAS FILED AN OFFICIAL COMPLAINT AGAINST THE CHINNASWAMY STADIUM DJ. 🚨
📝 CSK has filed a complaint with the BCCI against the Chinnaswamy Stadium DJ. 🏟️
According to CSK, the selection of the song “Idli, Dosa, Chutney Chutney” was inappropriate. (Express Sports) pic.twitter.com/0TLxIRhPfy
— Cricket News (@I_am_Unkar_006) April 16, 2026
‘డీజే ఎవరైనా తమ సొంత జట్టుకు మద్దతునిస్తారు. అయితే.. చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ప్రత్యర్థి జట్టును, ఆటగాళ్లను అవమానించేలా డీజే ప్రవర్తించాడు. మా బ్యాటర్లు ఔటైనప్పుడు డీజే అభ్యంతరంగా కామెంట్లు చేశాడు. అందుకని అతడిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశాం. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం’ అని సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు.
‘ఇడ్లీ, దోసె, సాంబార్, చట్నీ’ పాటను గనా అప్పు అనే సంగీతకారుడు రూపొందించాడు. అయితే.. ఈ పాటను ఇరుజట్ల మ్యాచ్ సమయంలో డీజే ప్లే చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, ఆటగాళ్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పద్దెనిమిదో సీజన్లోనూ సీఎస్కేతో మ్యాచ్కు ముందు తమ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఇడ్లీ, దోసె, సాంబార్, చట్నీ పాట పాడుతున్న వీడియోను ఆర్సీబీ పోస్ట్ చేసింది.
🚨 CSK FILES COMPLAINT 🚨
– 📝 Official complaint lodged to Board of Control for Cricket in India against Chinnaswamy DJ 🏟️
Song choice “idli, dosa, chutney chutney” termed inappropriate ❌CSK unhappy with the on-ground atmosphere 🎧
Tension off the field as well 👀🔥#csk pic.twitter.com/opv1OsuVPX— Akaran.A (@Akaran_1) April 16, 2026
అప్పడు చెన్నై ఫ్రాంచైజీ జితేశ్ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి డీజే కూడా అదే పాట అందుకోవడంతో సీఎస్కే కోపం నశాలనికంటింది. ఇక మౌనంగా ఉంటే అలుసై పోతామని భావించిన యాజమాన్యం చిన్నస్వామి డీజైపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.