సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత!
సీఎం ఇలాకాలోకి బుల్డోజర్లు మరోసారి దూసుకొచ్చాయి. నారాయణపేట జిల్లా కోస్గి-చెన్నారం రహదారిలో రోడ్డు విస్తరణ పేరుతో వ్యాపార సముదాయాలు, నివాసాలు, బాలికల హాస్టల్‌పై ప్రతాపం చూపించారు.
- బాలికల వసతి గృహాన్నీ వదల్లే..
- కమిషనర్ ఆదేశాలతోనే: డీఈ
కోస్గి, అక్టోబర్ 29 : సీఎం ఇలాకాలోకి బుల్డోజర్లు మరోసారి దూసుకొచ్చాయి. నారాయణపేట జిల్లా కోస్గి-చెన్నారం రహదారిలో రోడ్డు విస్తరణ పేరుతో వ్యాపార సముదాయాలు, నివాసాలు, బాలికల హాస్టల్‌పై ప్రతాపం చూపించారు. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి అధికారులు కూల్చివేతలే లక్ష్యంగా పనులు కొన సాగిస్తున్నారు. ముందుగా బుల్డోజర్లు బాలికల వసతి గృహం ప్రహరీ కూల్చివేశాయి. హాస్టల్ వార్డెన్ ఇదేమిటని ప్రశ్నించగా అధికారులు బెదిరించినట్టు సమాచారం.
పాఠశాల నుంచి హాస్టల్‌కు చేరుకున్న విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను ఖాళీ చేయాలని చెప్తూ బుల్డోజర్లతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మొత్తం భవనాలను కూల్చే అధికారం తమకున్నదని డీఈ చెప్పిన మాటలు అక్కడున్న వారి గుండెల్లో గుబులు రేపింది. శుక్రవారం ఉదయం నుంచి కూల్చివేతలు చేస్తామని అంతలోపే ప్రభుత్వం నిర్దేశించిన స్థలం వరకు ఖాళీ చేయాలని మున్సిపల్ సిబ్బంది హుకుం జారీ చేశారు.
హాస్టల్ ప్రహరీని కూల్చేందుకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వార్డెన్ పుష్పవేణి ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. ఆడపిల్లలు ఉంటారని కూడా చూడకుండా ప్రహరీని కూల్చి వేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆడపిల్లల భద్రత కోసం హామీ తీసుకుందామని ప్రయత్నించినా కమిషనర్ అందుబాటులో లేరని చెప్పారు. అనంతరం పోలీస్‌స్టేషన్ చేరుకొని బాలికల భద్రత కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చెయ్యాలని ఎస్సైని కోరినట్టు ఆమె తెలిపారు. కోస్గి మండలంలో ఎక్కడ చూసినా పేదల ఇండ్ల్లపైకి బుల్డోజర్లను పంపి కూల్చివేతల పాలన కొనసాగిస్తున్నారని కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట్ నర్సింహులు పేర్కొన్నారు. కనీసం ఖాళీ చేయడానికి సమయం ఇవ్వరా అని ప్రశ్నించారు.
కూల్చివేతలతో నాకేం సంబంధం?
కోస్గిలో కూల్చివేతలపై నమస్తే తెలంగాణ కమిషనర్ నాగరాజును వివరణ కోరగా కూల్చివేతలతో తనకేమి సంబంధం లేదని చెప్పారు. అదంతా పంచాయతీరాజ్ అధికారులే చూస్తున్నారని తెలిపారు. బాలికల హాస్టల్ కూల్చివేత విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

