Home
Telangana
Telangana High Court Orders Housing Board To Complete Flat Registrations Within 10 Days
ప్రైవేట్ సంస్థ అనుకుంటున్నారా?
వడ్డీ చెల్లించలేదన్న కారణంతో ఏండ్ల తరబడి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ హౌసింగ్ బోర్డుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
- హౌసింగ్ బోర్డుపై అసంతృప్తి
- పది రోజుల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): వడ్డీ చెల్లించలేదన్న కారణంతో ఏండ్ల తరబడి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ హౌసింగ్ బోర్డుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. హౌసింగ్ బోర్డు ప్రభుత్వ సంస్థనా? లేక ప్రైవేట్ సంస్థనా? అని ప్రశ్నించింది. వ్యాపార దృక్పథంతో వ్యవహరించడం ఏమిటని నిలదీసింది.
ఫ్లాట్లను ప్రజాధనంతో నిర్మించిన విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించింది. పెండింగ్ సొమ్ముపై 14 శాతం వడ్డీ, ఇతర సర్దుబాట్లతో సంబంధం లేకుండా 107 మందికిపైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు 10 రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలని ఆదేశించింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలు రద్దవుతుందని పేరొంది. విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

