Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
Thailand | థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్ ద్వీపంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
Thailand | థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్ ద్వీపంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున వాహనాల అద్దె వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే అవి పక్కనే ఉన్న పలు భవనాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.17 గంటలకు ఫాంగ్ మువాంగ్ సాయి కోర్ రోడ్డులోని భవనంలో మంటలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఐదు వాణిజ్య యూనిట్లు దెబ్బతిన్నాయి. భవనం సమీపంలో పార్క్ చేసిన పలు ద్విచక్ర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 36 మందిని ఆస్పత్రులకు తరలించగా.. వారిలో 15 మంది థాయ్ జాతీయులు, ఒకరు మయన్మార్ దేశస్థుడు ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. మృతులు, క్షతగాత్రుల్లో పర్యాటకులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు.
మంటలు వేగంగా వ్యాపించడానికి కారణాలివే..
భవనం గ్రౌండ్ ఫ్లోర్లో సుమారు 100 మోటార్ సైకిళ్లు పార్క్ చేసి ఉన్నాయని పటాంగ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సనకోర్న్ కీసిన్ తెలిపారు. వాహనాల్లోని ఇంధనం, రబ్బరు టైర్లు, ప్లాస్టిక్ భాగాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు వివరించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు భవనంలోని కొందరు పై అంతస్తులకు వెళ్లగా.. దట్టమైన పొగ కారణంగా బయటకు రావడం కష్టమైంది. పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తుపాను సమయంలో భవనం ముందు ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ స్తంభం వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని ఫుకెట్ గవర్నర్ చోటెనారిన్ కెర్డ్సోమ్ ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
11 people have died and 36 reportedly injured following a major fire in Patong, Phuket, in the early hours of 16 November.
The fire broke out at around 03:20am at a commercial building on Phang Muang Sai Kor Road and spread to neighbouring buildings.
Firefighters brought the blaze under control after approximately 40–50 minutes. Authorities are investigating the incident.
#thailand #phuket #fire #patong #ไฟไหม้ #ป่าตอง
— Thai Enquirer (@ThaiEnquirer) November 16, 2026
గతంలోనూ థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదాలు
థాయ్‌లాండ్‌లో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2022లో తూర్పు థాయ్‌లాండ్‌లోని ఓ మ్యూజిక్ పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందారు. అంతకుముందు 2009 జనవరి 1న రాజధాని బ్యాంకాక్‌లోని శాంటికా నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చెలరేగిన మంటల్లో 67 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల బ్యాంకాక్‌లోని ఓ బార్లో జరిగిన అగ్నిప్రమాదంలోనూ కనీసం 27 మంది మృతి చెందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం.. ఇనుప రాడ్డు చేతిలో దిగి యువకుడి నరకయాతన
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్స్ అందించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

