అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్స్ అందించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
అర్హులైన ప్రతి పేదవాడికి చేయూత పెన్షన్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ : అర్హులైన ప్రతి పేదవాడికి చేయూత పెన్షన్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలవాలని, పేదలకు అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్లో చేయూత పెన్షన్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాల్లో వందమంది కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం పది మందికే పింఛన్లు మంజూరయ్యేవని, మిగతా 90 మంది తమకు పెన్షన్ రావాలంటే లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోవాలని ఎదురుచూసే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఫెన్షన్ ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2,000కు పెంచి పేదలకు అండగా నిలిచిందని తెలిపారు. గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అంతమందికీ పింఛన్లు అందించాలనే లక్ష్యంతో ఆనాడు ప్రభుత్వం పనిచేసిందన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గతంలో కొత్తపల్లి మండలంలో 2,327 పింఛన్లు ఉండగా, తాజాగా మరో 354 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా పింఛన్లు పొందిన అర్హులకు అభినందనలు తెలిపారు.
అయితే ఇంకా అనేక గ్రామాల్లో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు ఉన్నారని, చిన్నచిన్న సాంకేతిక కారణాలతో, రేషన్ కార్డుల నిబంధనలతో కొందరికి పింఛన్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరినీ గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, గ్రామాల్లో పక్షపాతానికి తావులేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ తో పాటు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ ఫాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీఓ అశోక్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్స్ అందించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Ramayanam | రామాయణం బాక్సాఫీస్ సునామీ.. సెకండ్ సండే రూ.75 కోట్ల వసూళ్లు,ధురంధర్ 2 రికార్డు బద్దలు!
Jay Shah: ఐసీసీ చైర్మెన్‌గా రెండోసారి జే షా నియామకం
Kothagudem | కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారిన కొత్తగూడెం బైపాస్..! సింగరేణి నిధుల దుర్వినియోగం
Chiranjeevi | AI దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి పోరాటం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం.. !
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

