Ramayanam | రామాయణం బాక్సాఫీస్ సునామీ.. సెకండ్ సండే రూ.75 కోట్ల వసూళ్లు,ధురంధర్ 2 రికార్డు బద్దలు!
Ramayanam | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం పార్ట్ 1’ ప్రభంజనం కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విజువల్ వండర్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Ramayanam | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం పార్ట్ 1’ ప్రభంజనం కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విజువల్ వండర్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించగా, రెండో వారాంతంలోనూ అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా రెండో ఆదివారం నమోదైన కలెక్షన్లు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే ‘ధురంధర్ 2’ పేరిట ఉన్న సెకండ్ సండే రికార్డును కూడా రామాయణం అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
‘రామాయణం’ సినిమా రెండో వారాంతంలోనూ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నవంబర్ 15, ఆదివారం ఈ చిత్రం భారతదేశంలో సుమారు రూ.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సాక్నిల్క్ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు శనివారం నమోదైన రూ.72.90 కోట్లతో పోలిస్తే ఆదివారం కలెక్షన్లు మరింత పెరగడం విశేషం. సాధారణంగా సినిమాలకు మొదటి వారాంతం తర్వాత వసూళ్లు తగ్గుతుంటాయి. కానీ ‘రామాయణం’ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. రెండో ఆదివారం కూడా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో ఈ సినిమా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘రామాయణం’ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ విషయంలో ‘ధురంధర్ 2’ సాధించిన రూ.68 కోట్ల వసూళ్లు రికార్డుగా ఉన్నాయి. అయితే రామాయణం రెండో ఆదివారం రూ.75 కోట్లు సాధించినట్లు వచ్చిన గణాంకాలతో ఆ రికార్డు బద్దలైంది.
దీంతో రెండో ఆదివారం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో రామాయణం అగ్రస్థానానికి చేరినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రెండో వారంలోనూ కలెక్షన్లు పెరుగుతుండటం ఈ సినిమా బాక్సాఫీస్ బలాన్ని తెలియజేస్తోంది. ‘రామాయణం’ సినిమా వసూళ్ల జోరు ఇతర భారీ చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం భారత్‌లో సుమారు రూ.760.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సాక్నిల్క్ గణాంకాలు వెల్లడించాయి. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ.643.87 కోట్ల లైఫ్‌టైమ్ నెట్ కలెక్షన్లను అధిగమించింది. అలాగే రాజ్‌కుమార్ రావ్ నటించిన ‘స్త్రీ 2’ రూ.625.27 కోట్లు, విక్కీ కౌశల్ ‘ఛావా’ రూ.601.57 కోట్లు, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ రూ.544.28 కోట్లు, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ రూ.556.36 కోట్ల వసూళ్లను కూడా దాటేసినట్లు సమాచారం. ఒకే సినిమాతో ఇన్ని భారీ చిత్రాల రికార్డులను అధిగమించడం ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద చర్చగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayanam | రామాయణం బాక్సాఫీస్ సునామీ.. సెకండ్ సండే రూ.75 కోట్ల వసూళ్లు,ధురంధర్ 2 రికార్డు బద్దలు!
Jay Shah: ఐసీసీ చైర్మెన్‌గా రెండోసారి జే షా నియామకం
Kothagudem | కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారిన కొత్తగూడెం బైపాస్..! సింగరేణి నిధుల దుర్వినియోగం
Chiranjeevi | AI దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి పోరాటం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం.. !
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

