Chiranjeevi | AI దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి పోరాటం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం.. !
Chiranjeevi | ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అయితే ఇదే సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి నకిలీ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, వ్యక్తుల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం, డిజిటల్ మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Chiranjeevi | ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అయితే ఇదే సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి నకిలీ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, వ్యక్తుల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం, డిజిటల్ మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ టెక్నాలజీ ముప్పును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం చిరంజీవి తీసుకున్న ఈ చొరవ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృష్టిస్తున్న నకిలీ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్ వల్ల సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తుల అనుమతి లేకుండా వారి ముఖాలు, గొంతులను ఉపయోగించి అసత్య ప్రచారాలకు పాల్పడటం, అభ్యంతరకరమైన వీడియోలు రూపొందించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏఐ సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహిస్తూనే, దాని దుర్వినియోగం వల్ల ఎవరికీ నష్టం జరగకుండా పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ విషయానికి సంబంధించి చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో కీలక వివరాలను వెల్లడించారు. నవంబర్ 2న తనయుడు రామ్ చరణ్‌తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో ఏఐ సాంకేతికత దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోల వల్ల ఎదురవుతున్న ప్రమాదాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సమస్య తీవ్రతను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. అంటే సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల డిజిటల్ భద్రతకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్య కేవలం సినీ ప్రముఖులకు మాత్రమే పరిమితం కాదని చిరంజీవి స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- AI
- bobby
- Chiranjeevi
- Daughter
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | AI దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి పోరాటం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం.. !
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Sruthi Hassan | ఇంట్లో దెయ్యం ఉందని భయపడిన శృతి హాసన్.. కదిలే బొమ్మతో వణికిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్!
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రామలింగం మౌన యాత్ర
Tummala Nageswara Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం అసాధ్యం..! మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

