Kothagudem | కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారిన కొత్తగూడెం బైపాస్..! సింగరేణి నిధుల దుర్వినియోగం
కార్పొరేషన్ గా రూపు దాల్చిన జిల్లా కేంద్రమైన కొత్తగూడెం రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉంది. ముఖ్యంగా నగరంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం వెళ్లే ప్రధాన బైపాస్ రహదారి పరిస్థితి వాహనదారులకు, పాదచారులకు నరకప్రాయంగా మారింది.
కొత్తగూడెం ప్రగతి, నవంబర్ 16: కార్పొరేషన్ గా రూపు దాల్చిన జిల్లా కేంద్రమైన కొత్తగూడెం రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉంది. ముఖ్యంగా నగరంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం వెళ్లే ప్రధాన బైపాస్ రహదారి పరిస్థితి వాహనదారులకు, పాదచారులకు నరకప్రాయంగా మారింది. ఈ బైపాస్ రహదారి సింగరేణి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు కాసులు కురిపించే కల్పవృక్షంగా నిలిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సింగరేణి, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న కొత్తగూడెం నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది.
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం వెళ్లే ప్రధాన బైపాస్ రహదారి అడుగడుగునా గుంతలు ఏర్పడి వాహనదారులకు, పాదచారులకు, ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నరకాన్ని తలపిస్తోంది. ఎన్నో ప్రభుత్వ, సింగరేణి కార్యాలయాలు ఉన్న ఈ బైపాస్ రోడ్డు గత మూడు ఏళ్లకు పైగా భారీ గుంతలు పడడంతో పాటు రోడ్డు కొట్టుకుపోయి దుమ్ము ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ బైపాస్ రహదారిలో సింగరేణి బొగ్గులోడు టిప్పర్లు నిత్యం భారీ సంఖ్యలో రాకపోకలు జరుపుతుండడం వల్ల తారు మొత్తం కొట్టుకుపోయి గుంతలమయంగా మారింది.
అనారోగ్యాల పాలవుతున్న ప్రజలు..
ఇటీవల ఈ రహదారిని ఫోర్ లైన్ రోడ్డుగా సుందరీకరించడానికి సింగరేణి సంస్థ సుమారు రూ.12 కోట్లకు పైగానే టెండర్ నోటిఫికేషను తెరమీదకు తెచ్చింది. ఇది గడిచి దాదాపు రెండు నెలల పైగానే గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రహదారి మరింత అద్వానంగా తయారవుతుంది.
ముఖ్యంగా ఈ బైపాస్ లోని శేషగిరి నగర్ కాలనీ వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి, అక్కడ వాహనాల రద్దీతో తీవ్రమైన దుమ్ము ధూళి లేచి ఆ ప్రాంతం మొత్తం కాలుష్యమయంగా మారింది. దీంతో ఆ ప్రాంతవాసులు నిత్యం అనారోగ్యాల పాలవుతున్నారు. ఇదే క్రమంలో పలుమార్లు వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ నిరసనలు సైతం వ్యక్తం చేసినప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం శోచనీయం.
స్పందించిన అధికారులు..
ప్రజలు ఏదైనా నిరసన వ్యక్తం చేసినప్పుడు ప్రజా ప్రతినిధులు అటువైపుగా కొందరు సంబంధిత అధికారులను తీసుకొని వెళ్లి హడావిడి చేసి అక్కడి ప్రజలను మభ్యపెట్టడం, వారి నిరసనలను విరమింపజేయడం పరిపాటిగా మారింది. ఏళ్ల తరబడి ఈ బైపాస్ రోడ్డులోని చుంచుపల్లి, రైటర్ బస్తి, రామాంజనేయ కాలనీ, శేషగిరి నగర్, వెంకటేశ్వర కాలనీ, వికలాంగుల కాలనీ, హేమచంద్రపురం ప్రజలు తీవ్ర కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న కూడా ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఎవరు స్పందించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
స్థానిక ప్రజలు నిరసనలు వ్యక్తం చేసినప్పుడల్లా తూతూ మంత్రంగా గుంతలకు మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని, దీనివల్ల ఈ బైపాస్ రోడ్డు కాంట్రాక్టర్లకు మాత్రమే కల్పవృక్షంగా మారిందని, తాత్కాలిక మరమ్మతులతో ప్రజా సమస్య తీరదని ప్రజలు తమ గోడుని వెళ్లబుచ్చుకుంటున్నారు.
సింగరేణి ధనం దుర్వినియోగం
కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ప్రతినిధులు ఈ రోడ్డు సుందరీకరణకు నిధులు విడుదల అవుతున్నాయి అంటూ తమను మభ్య పెట్టడం సమంజసం కాదని ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడినప్పుడల్లా మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్ల కడుపు నింపి, తమ నోట్లో “దుమ్ము” కొడుతున్నారని, దీనివల్ల సింగరేణి ధనం దుర్వినియోగం కావడం తప్ప మరి ఏది లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
సింగరేణి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ప్రజా ప్రతినిధులు తమకు అందాల్సిన కమిషన్ కోసమే ఈ రోడ్డు నిర్మాణానికి అడ్డుతగులుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని శేషగిరి నగర్ కాలనీవాసులు అల్టిమేటం జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kothagudem | కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారిన కొత్తగూడెం బైపాస్..! సింగరేణి నిధుల దుర్వినియోగం
Chiranjeevi | AI దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి పోరాటం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం.. !
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Sruthi Hassan | ఇంట్లో దెయ్యం ఉందని భయపడిన శృతి హాసన్.. కదిలే బొమ్మతో వణికిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్!
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రామలింగం మౌన యాత్ర
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

