AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
AI Technology: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాటు దానికి సంబంధించిన అనుబంధ వ్యవస్థల రక్షణ కోసం అమెరికా నేతృత్వంలో కొన్ని దేశాలు కూటమిగా మారాయి. అయితే శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌లో ఇండియా కూడా సంతకం చేసింది.
శాన్ ఫ్రాన్సిస్ కో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(AI Technology) అంశంలో డ్రాగన్ దేశం చైనా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలో అనేక దేశాలు ఆ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ప్రకటించాయి. అయితే ఆ కూటమిలో ఇండియా కూడా సంతకం చేసింది. కీలకమైన టెక్నాలజీలు, ఏఐ సప్లయ్ చైన్స్‌ను పోటీ నుంచి కాపాడుకునే రీతిలో అమెరికా ఓ గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ గ్రూపులో ఇండియాతో పాటు దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ సంతకాలు చేసినట్లు అమెరికా విదేశాంగ వ్యవహారాల మంత్రి జాకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన నివేదికను ఫైనాన్షియల్ టైమ్స్‌లో ప్రచురించారు.
ఇక జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్, యురోపియన్ కమీషన్ త్వరలో ఈ గ్రూపులో చేరనున్నట్లు తెలిసింది. అగ్రిమెంట్లో సంతకం చేసిన దేశాల్లో జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యూకే కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉత్పత్తుల సరఫరా, టెక్నాలజీ రక్షణకోసం అమెరికా ఈ కూటమిని ఏర్పాటు చేసింది. పాక్స్ సిలికా పేరుతో ఈ పథకాన్ని కొనసాగించనున్నది. సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, ఎనర్జీ, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ అంశాల్లో చైనా నుంచి తీవ్ర పోటీ తలెత్తుతున్న నేపథ్యంలో శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్‌ను అమెరికా ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం.. ఇనుప రాడ్డు చేతిలో దిగి యువకుడి నరకయాతన
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

