రియల్ అల్లకల్లోలం
కాంగ్రెస్ పాలనలో రియల్ రంగం అల్లకల్లోలమైంది. కోలుకోలేనంతగా కుదేలైంది. హైడ్రా కూల్చివేతల భయం..22ఏతో రిజిస్ట్రేషన్ల నిలిపివేత..100 గజాల్లోపు ప్లాట్లకు సంబంధించి.. కఠిన నిబంధనలు.. వెరసి.. మూడేండ్లలో ఈ ‘మూడు’ విధానపరమైన నిర్ణయాల ముప్పేట దాడితో మధ్య తరగతి జీవితాలను చిన్నాభిన్నమైంది.
- కాంగ్రెస్ పాలనలో కుదేలైన రంగం
- మూడేండ్లలో మూడు విధానపరమైన నిర్ణయాలు
కాంగ్రెస్ పాలనలో రియల్ రంగం అల్లకల్లోలమైంది. కోలుకోలేనంతగా కుదేలైంది. హైడ్రా కూల్చివేతల భయం..22ఏతో రిజిస్ట్రేషన్ల నిలిపివేత..100 గజాల్లోపు ప్లాట్లకు సంబంధించి.. కఠిన నిబంధనలు.. వెరసి.. మూడేండ్లలో ఈ ‘మూడు’ విధానపరమైన నిర్ణయాల ముప్పేట దాడితో మధ్య తరగతి జీవితాలను చిన్నాభిన్నమైంది. రియల్టర్ల మనుగడ ప్రశ్నార్థకం చేసింది. కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత చర్యలతో భవన నిర్మాణాలు, ప్లాట్ల కొనుగోళ్లు ఆగిపోయాయి. రూ. కోట్ల లావాదేవిలు నిలిచిపోయాయి.
రియల్ ఎస్టేట్ పూర్తి మందగించింది. దీనిపై ఆధారపడ్డ వివిధ వర్గాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. సామాన్యులు కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో నిర్మించుకున్న ఆస్తులు అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు. రియల్ రంగంపై కాంగ్రెస్ సరార్ అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 3న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సహా అన్ని జోనల్ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చింది.
-సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి వరుస గ్రహణాలు పట్టుకున్నాయి. గడిచిన మూడేండ్ల కాలంగా రియాల్టీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో పూర్తిగా కుదేలైంది. ఒకవైపు హైడ్రా కూల్చివేతల భయం.. మరోవైపు 22ఏ (నిషేధిత భూముల)తో రిజిస్ట్రేషన్ల నిలిపివేత , ఇంకోవైపు 100 గజాల లోపు ప్లాట్లకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలు సగటు మధ్యతరగతి జీవి ఆశలను, రియల్టర్ల మనుగడను ప్రశ్నార్థకం చేశాయి.
కాంగ్రెస్ ప్రభు త్వ విధానాల వల్ల భవన నిర్మాణాలు, ప్లాట్ల కొనుగోళ్లు స్తంభించిపోయి రూ.కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సరార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తమ నిరసన గళాన్ని విప్పేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 3న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సహా అన్ని జోనల్ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చింది.
చెదిరిన సామాన్యుడి కల
జీవో 168 నిబంధనల అమలుతో సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల కల చెల్లాచెదురైంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుని 75 నుంచి 100 చదరపు గజాల మధ్య ఉన్న స్థలాల్లో సొంతింటి కల నెరవేర్చుకుందామనుకునే సగటు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం కొత్త నిర్మాణ నిబంధనలతో గొడ్డలిపెట్టుగా మారింది. చిన్న ప్లాట్లలో పర్మిషన్లు, లేఅవుట్ మార్గదర్శకాల పేరుతో విధించిన ఆంక్షలు సగటు జీవిని ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నాయి. చాలా చోట్ల 75 గజాల నుంచి 100 గజాల మధ్య ఉన్న ఫ్లాట్లకు, ముఖ్యంగా పాత లే అవుట్లలోని చిన్న ఫ్లాట్లకు బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం లేదు. 18X50 సైజు ఉన్న ఫ్లాట్లకు మూడు నెలల నుంచి పర్మిషన్ నిరాకరిస్తుండడంతో లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
రియల్టర్లు, మధ్యతరగతి విలవిల!
గతంలో భూముల క్రయవిక్రయాలతో కళకళలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ వివరించారు. రియల్ ఎస్టేట్ మందగించడంతో దానిపైనే ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్, ఐరన్, ట్రాన్స్పోర్ట్ వ్యాపారులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారన్నారు.
ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ముందస్తు ప్రణాళిక లేని జీవోల వల్ల పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు అప్పులపాలవుతుంటే.. కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో ప్లాట్లు కొన్న మధ్యతరగతి ప్రజలు ఆస్తులు అమర్చుకోలేక అల్లాడిపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పోరాట బాట పట్టిందని, వచ్చే నెల 3న జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పారు.
హైడ్రా పేరుతో సామాన్యులను, బిల్డర్లను భయాందోళనలకు గురిచేయడం వెంటనే ఆపాలని, 22ఏ జాబితాను తక్షణమే ప్రక్షాళన చేసి పట్టా భూములు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని, 100 గజాలలోపు ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ల ప్రక్రియను సరళీకృతం చేయాలని ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. వేలాది మంది రియల్టర్లు, బాధితులతో ముట్టడిస్తామని ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా సరార్ స్పందించి రియల్ రంగాన్ని, మధ్యతరగతి ప్రయోజనాలను కాపాడకపోతే
ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
22ఏ పిడుగు
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా హైడ్రా భయంతోనే విలవిలలాడుతున్న రియల్ రంగంపై సర్కార్ 22ఏ పిడుగు మోపింది. గతంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ అనుమతులు ఉన్న ఓపెన్ ప్లాట్లను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడం వల్ల లక్షలాది మంది సామాన్యులు ఆస్తులు అమ్ముకోలేక, కొనుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..అయితే ఇటీవల జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులున్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల సడలింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతూననే ఉన్నాయి. ఇంకా అనుమతులు లేని పాత వెంచర్ల యజమానులకు సమస్యలు అలాగే మిగిలిపోయాయి. 22ఏ భూతంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరిగినా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో వేలాది మంది కొనుగోలుదారులు, బిల్డర్లు తమ సొమ్మును కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి.
హైడ్రా బుల్డోజర్లకు రియాల్టీ రివర్స్ గేర్
చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పునరుద్ధరణ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో స్పష్టత లేకుండా.. ఏండ్ల కిందట నిర్మించుకున్న ఇండ్లను కూడా విచక్షణారహితంగా కూల్చివేస్తూ వచ్చింది. పేదోడు, పొట్ట చేతల పట్టుకుని వచ్చిన కూలీల గూడును కూల్చి వారి జీవితాలను రోడ్డున పడేసింది. ఎంతలా అంటే లేక్ వ్యూ ప్రాజెక్టు చేపట్టాలంటేనే బిల్డర్లు వణికిపోయే స్థితికి తీసుకువచ్చారు.
హైడ్రా విధ్వంసంతో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారీ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఏ క్షణంలో ఏ బిల్డింగ్ మీదకు బుల్డోజర్ వస్తుందో తెలియక హైదరాబాద్ నగరంలో స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు కూల్చేస్తారనే భయంతో రిజిస్ట్రేషన్లు ప్రతి ఏటా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. బ్యాంకులు లోన్లు ఇవ్వడం నిలిపివేయగా, కొనుగోలుదారులు అడ్వాన్సులు వెనకి తీసుకుంటూ.. వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌తో పాటు చుట్టుపకల జిల్లాల్లోనూ భూముల ధరలు దారుణంగా పడిపోయాయని వివరించారు.
బుల్డోజర్ విధ్వంసం
- కోలుకోలేని దెబ్బకొట్టిన హైడ్రా చర్యలు
- విచక్షణారహితంగా ఇండ్ల కూల్చివేతలు
- రోడ్డున పడ్డ పేదలు.. వణికిన బిల్డర్లు
చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పునరుద్ధరణ పేరుతో హైడ్రా పెను విధ్వంసం స్పష్టించింది. అనుమతుల విషయమై స్పష్టత లేకుండా.. విచక్షణా రహితంగా ఇండ్ల కూల్చివేతలు చేపట్టింది. పేదల గూడుపై బుల్డోజర్తో విరుచుకుపడింది. ఏ క్షణం ఏ బిల్డింగ్ మీదకు బుల్డోజర్ వస్తుందో తెలియక స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనాలంటేనే వణికిపోయే పరిస్థితి దాపురించింది. భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. హైడ్రా చర్యలతో ఇండ్ల కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి.
22ఏ పిడుగు
- నిషేధిత జాబితాలో అనేక భూములు
- ఆస్తులు.. అమ్మలేక కొనలేక యజమానుల తంటాలు
- రిజిస్ట్రేషన్లు కాక.. కన్నీరుమున్నీరు
హైడ్రా స్పష్టించిన విధ్వంసం రియల్ రంగాన్ని కోలుకోలేకుండా చేస్తే.. సర్కార్ నిషేధిత జాబితా పేరిట 22ఏ పిడుగు మోపింది. గతంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ అనుమతులు ఉన్న ఓపెన్ ప్లాట్లను ఈ జాబితాలో చేర్చడం వల్ల లక్షలాది మంది సామాన్యులు ఆస్తులు అమ్ముకోలేక, కొనుకోలేక మనోవేదనకు గురయ్యారు. ఇటీవల జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులున్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల సడలింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చినా.. .క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరిగినా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో అనేక మంది కొనుగోలుదారులు, బిల్డర్లు తమ సొమ్మును కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది.
కలగా సొంతిల్లు
- 100 గజాల్లోపు ప్లాట్లకు నో పర్మిషన్
- సగటు జీవి ఇల్లు కట్టుకోకుండా అడ్డుకట్ట
- సర్కార్ నిర్ణయంతో లక్షలాది మందిపై ప్రభావం
పొదుపు చేసుకుని 75 నుంచి 100 చదరపు గజాల మధ్య ఉన్న స్థలాల్లో సొంతింటి కల నెరవేర్చుకుందామనుకునే సగటు మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. జీవో 168 నిబంధనల అమలుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల కల చెల్లాచెదురైంది. ప్రభుత్వం కొత్త నిర్మాణ నిబంధనలతో గొడ్డలిపెట్టుగా మారింది. చిన్న ప్లాట్లలో పర్మిషన్లు, లేఅవుట్ మార్గదర్శకాల పేరుతో విధించిన ఆంక్షలు సగటు జీవిని ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నాయి.
రియల్టర్లు అప్పుల పాలు
- తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
- 3న బల్దియా ఆఫీసు ముట్టడి
ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ముందస్తు ప్రణాళిక లేని జీవోల వల్ల పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు అప్పుల పాలవుతుంటే.. కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో ప్లాట్లు కొన్న మధ్యతరగతి ప్రజలు ఆస్తులు అమ్ముకోలేక అల్లాడిపోతున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయని, రియల్ రంగంపై ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్, ఐరన్, ట్రాన్స్పోర్ట్ వ్యాపారులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని చెప్పారు. సర్కార్ వైఖరికి నిరసనగా నవంబర్ 3న జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

