YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
YS Jagan | చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, నారా లోకేష్ కారణమని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
అమరావతి : చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి (Student Suicide ) చంద్రబాబు, నారా లోకేష్ కారణమని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు ఉరితాడు దిక్కవుతుందని, ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులంటూ ట్విటర్లో విమర్శించారు.
ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్ల గక్కినా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా వైసీపీ ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్ర పన్నిందని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. సుమారు రూ.9,600 కోట్లకుపైగా విద్యార్థులకు బాకీ పడ్డారని వివరించారు. విద్యాశాఖను భ్రష్టుపట్టించిన నారా లోకేష్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
KTR | కాంగ్రెస్ ‘అభయహస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు!
NZvIND: టెస్టు బృందంలోకి గుర్నూర్ బ్రార్.. స్వదేశానికి కుల్దీప్ యాదవ్
KTR | బ్రహ్మోత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం.. ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు
APEC Summit: ఎపెక్‌లో భేటీకానున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

