NZvIND: టెస్టు బృందంలోకి గుర్నూర్ బ్రార్.. స్వదేశానికి కుల్దీప్ యాదవ్
NZvIND: పేస్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు.. భారత టెస్టు బృందంలో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల కోసం అతన్ని సెలెక్ట్ చేశారు. నవంబర్ 19 నుంచి కివీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభంకానున్నది.
వెల్లింగ్టన్: పేస్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు.. భారత టెస్టు బృందంలో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల(NZvIND) కోసం అతన్ని సెలెక్ట్ చేశారు. నవంబర్ 19 నుంచి కివీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభంకానున్నది. కివీస్ పిచ్‌లు స్పీడ్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టెస్టు బృందం నుంచి తప్పించారు. కుల్దీప్ స్వదేశీ క్రికెట్ టోర్నీల్లో ఆడనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది. టెస్టు బృందంలో చోటు దక్కడంతో.. కివీస్‌తో జరిగే అయిదో వన్డే కోసం బ్రార్‌ను పక్కన పెట్టారు. ఆదివారం మౌంట్ మౌంగనుయిలో అయిదో వన్డే జరగనున్నది. ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టడంలో బ్రార్ సఫలమవుతున్నట్లు తెలిసింది.
తొలి టెస్టులో నలుగురు స్పీడ్ బౌలర్లను ఆడించే ఆలోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఆ బృందంలో ఉన్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా జట్టుతో కలిశాడు. అతను టెస్టుల్లో ఆడనున్నాడు. కండరాల నొప్పి వల్ల పంత్ ఇండియా ఏ సిరీస్‌లో ఆడలేదు. నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో రెండో టెస్టు జరుగుతుంది.
భారత బృందం: గిల్, జైస్వాల్, రాహుల్, పడిక్కల్, పంత్, జురెల్, జడేజా, కాంబోజ్, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, బ్రార్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: టెస్టు బృందంలోకి గుర్నూర్ బ్రార్.. స్వదేశానికి కుల్దీప్ యాదవ్
KTR | బ్రహ్మోత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం.. ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు
APEC Summit: ఎపెక్‌లో భేటీకానున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్
Tirumala | తిరుమలలో ఒక్కరోజే 4.03 లక్షల లడ్డూల విక్రయం
Dil Raju | కమ్‌బ్యాక్ అనే ప్రశ్న నాకు అస్సలు నచ్చదు: నిర్మాత దిల్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

