Dil Raju | కమ్‌బ్యాక్ అనే ప్రశ్న నాకు అస్సలు నచ్చదు: నిర్మాత దిల్ రాజు
Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ పంపిణీ చేసిన రామాయణ్, సీన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాడు దిల్ రాజు. అయితే ఈ సమావేశంలో సినిమాల ఫలితాలు మరియు తన కెరీర్‌కు సంబంధించి కొందరు విలేకరులు అడిగిన కమ్‌బ్యాక్ (Comeback) అనే ప్రశ్నపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారీ తనను ఈ ప్రశ్న అడగడం పట్ల ఆయన అసహనం ప్రదర్శించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తాను ఎప్పుడో ఇండస్ట్రీని విడిచి వెళ్లిపోయినట్లు, మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి వచ్చినట్లు “కమ్‌బ్యాక్” అనడం సరికాదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ టాలీవుడ్లోనే వరుస సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ రంగంలో బిజీగా ఉంటానని, నిరంతరం ప్రయాణం సాగిస్తున్న తనకు ప్రతిసారీ ‘కమ్‌బ్యాక్’ అనే పదం ఆపాదించడం బాగోలేదని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు తాను 500 సినిమాలు పంపిణీ చేయడంతో పాటు గత ఏడాది 300 కోట్ల బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాను. నేను ఎప్పుడు మార్కెట్లో ఉంటాను అని దిల్ రాజు చెప్పుకోచ్చాడు. ఈ సందర్భంగా ట్రేడ్ సర్కిల్స్‌లో జరిగే తప్పుడు ప్రచారాలు, అవాస్తవ లెక్కలను ఎవరూ పట్టించుకోవద్దని దిల్ రాజు కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dil Raju | కమ్‌బ్యాక్ అనే ప్రశ్న నాకు అస్సలు నచ్చదు: నిర్మాత దిల్ రాజు
అన్నదమ్ముల మధ్య కత్తులతో దాడులు.. అన్న కుమారుడి తలకు తీవ్రగాయం!
Guptha Padmasana | గుప్త పద్మాసనం అంటే ఏమిటి.. ఎలా వేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
IND vs PAK | దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన పాక్!
Bilal Kazi: 70 మంది అమ్మాయిలకు వేధింపులు.. బ్రిటన్‌లో భారతీయుడికి 30 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

