Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
Kollywood | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కోలీవుడ్’ (Kollywood) మేనియానే కనిపిస్తోంది.
Kollywood Box Office | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కోలీవుడ్’ (Kollywood) మేనియానే కనిపిస్తోంది. ఈ ఏడాది తమిళ సినిమా రంగం కేవలం కమర్షియల్ హద్దులకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలతోనూ, అఖండ విజయాలతోనూ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విభిన్న కథాంశాలు, సరికొత్త మేకింగ్ శైలితో కోలీవుడ్ మేకర్స్ ప్రేక్షకులకు కనులవిందు పంచుతున్నారు.
ఈ ఏడాది కోలీవుడ్‌లో విడుదలైన చిత్రాల జాబితా చూస్తే, వైవిధ్యానికి పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ (Thaai Kizhavi) గ్రామీణ నేపథ్యంలో సాగే అద్భుతమైన కామెడీ, డ్రామాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలాగే, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ (Jailer 2) బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ రూ. 830 కోట్లకు పైగా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించి, కోలీవుడ్ నుండి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇక ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేస్తూ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీసీ – లోకేష్ కనగరాజ్’ (DC – Lokesh Kanagaraj) చిత్రం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇవే కాకుండా ‘మొద రాత్రి’ (Modha Rathiri), ‘బత్తా’ (Baththa), ‘డోరోతి’ (Dorothy), ‘విత్ లవ్’ (With Love), ‘కరుప్పు’ (Karuppu), ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ (Vishwanath and Sons), ‘సీన్’ (Scene), ‘మండాడి’ (Mandaadi), ‘బ్లాస్ట్’ (Blast), ‘యూత్’ (Youth), మరియు ‘వంద దేవుళ్లు’ (Nooru Saami) వంటి ఎన్నో సినిమాలు వైవిధ్యమైన జోనర్లలో వచ్చి ప్రేక్షక లోకాన్ని అలరించాయి. థ్రిల్లర్లు, సస్పెన్స్ డ్రామాలు, రూరల్ ఎంటర్టైనర్లు, యాక్షన్ ప్యాక్డ్ మూవీస్‌తో కోలీవుడ్ పరిశ్రమ ప్రస్తుతం నంబర్ వన్ రేసులో దూసుకుపోతోంది. కంటెంటే కింగ్ అనే నిరూపిస్తూ తమిళ చిత్ర పరిశ్రమ సాగిస్తున్న ఈ ప్రయాణం ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు!
ఇక ఈ సినిమాలు ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనేది చూసుకుంటే!
తాయి కిళవి (Thaai Kizhavi) – జియో హాట్‌స్టార్ (JioHotstar) మరియు సింప్లీ సౌత్ (Simply South)
జైలర్ 2 (Jailer 2) – అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
డీసీ – లోకేష్ కనగరాజ్ (DC) – సోనీ లివ్ (SonyLIV) మరియు సన్ నెక్స్ట్ (Sun NXT)
మొద రాత్రి (Modha Rathiri) – నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బత్తా (Baththa) – నెట్‌ఫ్లిక్స్
డోరోతి (Dorothy) – నెట్‌ఫ్లిక్స్
విత్ లవ్ (With Love) – నెట్‌ఫ్లిక్స్
కరుప్పు (Karuppu) – నెట్‌ఫ్లిక్స్ (Netflix)
విశ్వనాథన్ అండ్ సన్స్ (Vishwanath and Sons) – నెట్‌ఫ్లిక్స్
మండాడి (Mandaadi) – – నెట్‌ఫ్లిక్స్
బ్లాస్ట్ (Blast) – నెట్‌ఫ్లిక్స్
యూత్ (Youth) – నెట్‌ఫ్లిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
KTR | కాంగ్రెస్ ‘అభయహస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు!
NZvIND: టెస్టు బృందంలోకి గుర్నూర్ బ్రార్.. స్వదేశానికి కుల్దీప్ యాదవ్
KTR | బ్రహ్మోత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం.. ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

