తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్' ఈ వ్యాఖ్యలన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన సీఎం రేవంత్‌రెడ్డి. విద్యాశాఖ మంత్రి హోదాలో ప్రతిసారి సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యపై అవాకులు చెవాకులు పేల్చుతూనే ఉన్నారు.
- ఇంజినీరింగ్ విద్యకు విద్యార్థుల అనాసక్తి
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్’ ఈ వ్యాఖ్యలన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన సీఎం రేవంత్‌రెడ్డి. విద్యాశాఖ మంత్రి హోదాలో ప్రతిసారి సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యపై అవాకులు చెవాకులు పేల్చుతూనే ఉన్నారు. ఇంజినీరింగ్ విద్యను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్య నేలచూపులు చూస్తున్నది. రెండు, మూడేండ్లుగా ప్రాభవం కోల్పోతున్నది.
తగ్గుతున్న అడ్మిషన్లు
రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లు భారీగా తగ్గుతున్నాయి. ప్రత్యేకించి కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యే సీట్లు మూడేండ్ల నుంచి ఏటా పడిపోతున్నాయి. 2024లో 91 శాతం సీట్లు నిండితే ఈ విద్యాసంవత్సరం కేవలం 79 శాతం సీట్లు మాత్రమే నిండాయి. అంటే 12 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2024లో ఖాళీ సీట్ల సంఖ్య 7,960 ఉండగా 2026కు వచ్చేసరికి 19,741కు పెరిగాయి. అంటే మూడేండ్లల్లో ఖాళీ సీట్ల సంఖ్య రెండున్నర రెట్లు పెరుగడం గమనార్హం.
సీఎస్ఈకి తగ్గిన క్రేజ్
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ బ్రాంచీలకు తీవ్ర డిమాండ్ ఉండగా క్రమంగా తగ్గుతున్నది. సీఎస్ఈ, ఐటీ బ్రాంచీల్లో అడ్మిషన్లు తగ్గాయి. 2024లో 97శాతం సీట్లు భర్తీ కాగా, 2025కు వచ్చే సరికి 92శాతానికి చేరగా, 2026లో ఏకంగా 82శాతానికి పడిపోయింది. ఒక్క సీఎస్ఈ బ్రాంచీలో 30,792 సీట్లుండగా, ఈ ఏడాది 25,785 (84శాతం) సీట్లు మాత్రమే నిండాయి.
ఐటీ బ్రాంచీలో 4,218 సీట్లుండగా, ఈ సారి 3,237 (77శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ వంటి కోర్ బ్రాంచీలకు స్వల్ప ఆదరణ కనిపిస్తున్నది. 2024లో ఈ బ్రాంచీల్లో 4,571 మంది చేరితే 2026కు వచ్చేసరికి 5,125కు పెరిగారు. ఇక ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లోను విద్యార్థుల చేరికల ఆశాజనంగానే ఉన్నది. ఈ విభాగంలో 2024లో 14,103 మంది చేరితే.. 2026లో 18,806 మంది చేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

