IPL Star | అమ్మ నగలు అమ్మి షూ కొన్నది.. పేదరికమే నన్ను రాటుదేల్చింది..!
IPL Star : ఒక్క మ్యాచ్‌తో ప్రపంచానికి పరిచయమైన ఆటగాళ్లు, ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు చాలామందే. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో ఔరా అనిపించిన షకీబ్ హుస్సేన్(Shakib Hussain) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
IPL Star : ఒక్క మ్యాచ్‌తో ప్రపంచానికి పరిచయమైన ఆటగాళ్లు, ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు చాలామందే. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో ఔరా అనిపించిన షకీబ్ హుస్సేన్ (Shakib Hussain) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేసర్‌గా తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో జట్టును గెలిపించాడు షకీబ్. బిహార్‌కు చెందిన ఈ కుర్ర పేసర్ సంచలనం పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగిపోతోంది. కుగ్రామం నుంచి ఐపీఎల్ స్టార్‌గా అవతరించిన షకీబ్‌ను పేదరికం కష్టాలు రాటుదేల్చాయి. షూ కొనేందుకు కూడా డబ్బులు లేని అతడు ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేయడానికి ఎంతో శ్రమించాడు. అంతకంటే ఎక్కువగా అవకాశం కోసం నిరీక్షించాడు.
బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ మాదిరిగా.. క్రికెట్ ఖరీదైన ఆటేమీ కాదు. కానీ, దేశవాళీలో ఆడాలంటే కనీస సౌకర్యాలు ఉండాలిగా. అందుకు డబ్బు కావాలి. పేదింటి బిడ్డైన షకీబ్ హుస్సేన్ ఫాస్ట్ బౌలర్‌గా మారేందుకు కష్టాలు అనుభవించాడు. బిహార్‌లోని చిన్న గ్రామం నుంచి నేడు ఐపీఎల్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్న షకీబ్ నేపథ్యం తెలియాలటే అతడి కథను తెలుసుకోవాల్సిందే. ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్న షకీబ్ కనీసం ఒక జత షూ కొనుక్కోలేకపోయాడట. నా కష్టాన్ని, నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని చూసిన అమ్మ తన నగులు అమ్మేసి.. షూ కొనిచ్చిందని ఒకానొక సందర్భంలో షకీబ్ వెల్లడించాడు.
Sakib Hussain — “Spike shoes are quite expensive. If we buy them, where will we get the money to eat?”
Sakib’s Mother — “I sold my own jewelry to buy him those shoes”
Their sacrifices have truly paid off. 🥹❤️ pic.twitter.com/ehLzuziq7i
— ` (@WorshipDhoni) April 14, 2026
‘క్రికెటర్లు ధరించే షూ చాలా ఖరీదైనవి. బౌలర్లు వేసుకునే స్పైక్స్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండేది. అంత మొత్తం షూ కోసం ఖర్చుపెడితే మేము ఏం తినాలి? మా ఆర్ధిక పరిస్థితి తలచుకొని నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇదే విషయం అమ్మ సుబుక్తరా ఖాటూన్తో చెప్పి ఏడ్చేవాడిని. అమ్మా.. నాకు షూ లేవు. నేను క్రికెట్ ఎలా ఆడగలను? అని బాధ పడేవాడిని. నా బాధను చూడలేక అమ్మ తన నగులు అమ్మేసి షూ కొనిచ్చింది. ఆ రోజు నుంచి నేను క్రికెటర్ అవ్వాలనేది మా కుటుంబ లక్ష్యంగా మారిపోయింది’ అని షకీబ్ తమ ఇంటి పరిస్థితిని వెల్లడించాడు.
Story of Sakib Hussain from Bihar
pic.twitter.com/mkCKEwIlvu https://t.co/WIRj0BsrnB— Shah (@Shahhoon1) April 13, 2026
ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన షకీబ్.. నాలుగేళ్లు కఠోరంగా శ్రమించాడు. రైతు కుటుంబంలో జన్మించిన షకీబ్ ఇంటి సమీపంలోని మైదానంలో స్నేహితులతో కలిసి ఉదయం పరుగెత్తేవాడు. మంచి ఎత్తు, ఫిట్నెస్ కలిగిన అతడిని గమనించిన కొందరు కోచ్‌లు క్రికెట్‌కు నువ్వు బాగా సరిపోతావు అని చెప్పారు. దాంతో.. క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్న షకీబ్ పేసర్‌గా మారాలనుకున్నాడు.
‘మొదట్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడిని. అప్పుడు.. మ్యాచ్‌కు రూ.500, రూ.700.. దూర ప్రాంతాల్లో మ్యాచ్‌కు వెళ్తే రూ.2,000 వచ్చేవి. సో.. క్రికెటర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. 17 ఏళ్లకే బిహార్ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాను. రెండో మ్యాచ్‌లోనే 20 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాను. అనంతరం రంజీ ట్రోఫీలో ఐదు వికెట్లతో నా పేరు మార్మోగిపోయింది. అప్పుడే.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాను’ అని షకీబ్ తన జీవితాన్ని మలుపు తిప్పిన రోజులను గుర్తు చేసుకున్నాడు.
నెట్ బౌలర్‌గా..
మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్‌గా ఆకట్టుకున్న షకీబ్‌ను.. 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కొన్నది. అయితే.. వరసగా రెండు సీజన్లలోనూ ఈ కుర్రాడికి అవకాశం రాలేదు. అయినా మనోడు నాకంటూ ఒక రోజు రాకపోతుందా అని ఎదురుచూసేవాడు. పంతొమ్మిదో సీజన్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.30 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది.
Another debutant making his mark ✅
🎥 Glimpses of Sakib Hussain’s 4/24 in his first outing in #TATAIPL 🔥
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @sunrisers pic.twitter.com/ByAMDOgJiB
— IndianPremierLeague (@IPL) April 13, 2026
తొలి మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్న అతడికి బౌలింగ్ కోచ్ వరుణ్ అరోన్(Varun Aaron) మద్దతు లభించగా.. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడే అవకాశం దక్కింది. ఇంకేముంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటూ నాలుగు వికెట్ల(4-24)తో మెరిశాడీ పేసర్. యశస్వీ జైస్వాల్‌ను ఔట్ చేసి తొలి ఐపీఎల్ వికెట్ సాధించిన షకీబ్.. స్లో డెలివరీతో ఫెరీరాను బౌల్డ్ చేసి సన్‌రైజర్స్ విజయాన్ని తేలిక చేశాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- CSK
- ipl 2026
- KKR
- Shakib Hussain
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

