న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా చేరిన వ్యక్తి తన అనుచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారి కుటుంబ సభ్యులను వారు నిర్బంధించారు. రూ.25 లక్షల విలువైన నగలను దోచుకున్నారు. (Businessman Family Hostage) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ధనికులు నివసించే గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలోని మద్యం వ్యాపారి అశోక్ చావ్లా ఇంట్లో సుశీల్ అనే వ్యక్తి కొత్తగా పనిలో చేరాడు. అతడు తన అనుచరులతో కలిసి ఆ ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేశాడు.
కాగా, గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధ జంట, వారి కోడలు, పిల్లలను ఒక గదిలో నిర్బంధించారు. వారిని బెదిరించడంతో పాటు ఇంట్లో అన్ని చోట్ల వెతికారు. రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యాపారి ఇంటికి చేరుకున్నారు. పనిమనిషి సుశీల్ పక్కా ప్లాన్, రెక్కీ నిర్వహించిన తర్వాత తన వారితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. అతడ్ని నియమించిన సంస్థ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. కాల్ డాటా వంటి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, హర్యానాతో సహా పలు రాష్ట్రాల్లో నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
BJP’s Women’s March | రాహుల్ గాంధీ నివాసం వద్ద బీజేపీ మహిళల నిరసన
Bird Flu Case | కర్ణాటకలో బర్డ్ ఫ్లూ కేసు.. వేల సంఖ్యలో కోళ్లు ఖననం
Ashok Kharat | అశోక్ ఖరత్ సన్నిహితుడు, అతడి భార్య.. రోడ్డు ప్రమాదంలో మృతి