Ashok Kharat | అశోక్ ఖరత్ సన్నిహితుడు, అతడి భార్య.. రోడ్డు ప్రమాదంలో మృతి
Ashok Kharat | జ్యోతిష్యం, వశీకరణ పేరుతో పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన అశోక్ ఖరత్ సన్నిహితుడు, అతడి భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణించిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది.
ముంబై: జ్యోతిష్యం, వశీకరణ పేరుతో పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన అశోక్ ఖరత్ (Ashok Kharat) సన్నిహితుడు, అతడి భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణించిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో భార్యాభర్తలు మరణించగా వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. తనకు తాను దేవుడిగా చెప్పుకున్న నాసిక్‌కు చెందిన అశోక్ ఖరత్ జ్యోతిష్కుడిగా ప్రసిద్ధి చెందాడు. తన వద్దకు వచ్చే పలువురు మహిళలను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, అశోక్ ఖరత్ కీలక అనుచరుడైన 55 ఏళ్ల జితేంద్ర షెల్కే అతడి వ్యాపార భాగస్వామి. ఆయనకు చెందిన ‘శివానికా ట్రస్ట్’ ఉపాధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నాడు. అయితే జితేంద్ర షెల్కే, తన భార్య అయిన 50 ఏళ్ల అనురాధ, కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి ఛత్రపతి సంభాజీనగర్ నుంచి థానేకు కారులో ప్రయాణమయ్యాడు.
మంబై-నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవేలోని ధోత్రే వద్ద కారు నడుపుతున్న జితేంద్ర నియంత్ర కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఆ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జితేంద్ర, ఆయన భార్య అనురాధ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వారి కుమారుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోపర్గావ్ పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Valparai Tragedy | కొండ మలుపు నుంచి కిందకు దూసుకెళ్లిన వాహనం.. ఏడుగురు టీచర్స్‌తో సహా 9 మంది మృతి
Car, Bus Catches Fire | ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు, 9 మంది మృతి
Watch: థార్‌తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

