Watch: థార్‌తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన
BJP MLA's son Rams Thar | బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనం నడిపిపాడు. బైక్‌తోపాటు, రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే తాను హారన్ మోగించినప్పటికీ ఎందుకు తప్పుకోలేదంటూ వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనం నడిపిపాడు. బైక్‌తోపాటు, రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళలపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. (BJP MLA’s son Rams Thar) అయితే తాను హారన్ మోగించినప్పటికీ ఎందుకు తప్పుకోలేదంటూ వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పిచోర్ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడైన దినేష్ లోధి గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో థార్ వాహనం నడిపాడు. కరేరా ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురితోపాటు నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి థార్‌ను దూకించాడు. వెనుక నుంచి వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరేరా పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు దినేష్ లోధి వింత వాదనకు దిగాడు. తాను హారన్ మోగిస్తున్నప్పటికీ రోడ్డు పక్కకు ఎందుకు తప్పుకోలేదని గాయపడిన వారిని ప్రశ్నించాడు. ఈ ప్రమాదానికి వారే కారణమన్నట్లు మాట్లాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తన అధికార దర్పాన్ని ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
“When I was sounding the siren, why didn’t you move?” says BJP MLA son after ramming 5 with Thar
In a shocking display of entitlement and power in Madhya Pradesh’s Shivpuri, Dinesh Lodhi, son of Pichhore MLA Pritam Lodhi, allegedly rammed his Thar into five people on the road.… pic.twitter.com/9eOHl3JgKM
— Piyush Rai (@Benarasiyaa) April 17, 2026
Also Read:
Woman High Court jump threat | హైకోర్టు పైకి ఎక్కిన మహిళ.. బిడ్డతో సహా కిందకు దూకుతానని బెదిరింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

