Man Pushes Paralysed Mother To Death | పక్షవాతంతో మంచానికి పరిమితమైన తల్లి.. నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి చంపిన కొడుకు
Man Pushes Paralysed Mother To Death | పక్షవాతంతో మంచానికి పరిమితమైన తల్లి పట్ల కుమారుడు దారుణంగా ప్రవర్తించాడు. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: పక్షవాతంతో మంచానికి పరిమితమైన తల్లి పట్ల కుమారుడు దారుణంగా ప్రవర్తించాడు. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Man Pushes Paralysed Mother To Death) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఆర్ఆర్ నగర్లోని బీఈఎంఎల్ లేఅవుట్లోని అపార్ట్మెంట్లో 42 ఏళ్ల వెంకటేష్ నివసిస్తున్నాడు. అతడి తల్లి 72 ఏళ్ల సావిత్రమ్మ నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నది. దీంతో ఆమె మంచానికే పరిమితమైంది.
కాగా, తల్లి దీర్ఘకాలిక అనారోగ్యం పట్ల కుమారుడు వెంకటేష్ తీవ్ర మనోవేదన చెందాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం వేళ అతడు దారుణానికి పాల్పడ్డాడు. నాలుగో అంతస్తులోని ఇంటి టెర్రస్ వద్దకు తల్లిని తీసుకువచ్చాడు. ఆమెను అక్కడి నుంచి కిందకు తోసేశాడు. రోడ్డుపై పడిన సావిత్రమ్మ గట్టిగా అరిచింది. తీవ్రంగా గాయపడటంతో ఆమె మరణిచింది.
మరోవైపు స్థానికులు అక్కడ గుమిగూడారు. రోడ్డుపై పడి మరణించిన సావిత్రమ్మను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. సావిత్రమ్మ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. అతడి కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే వెంకటేష్ను పోలీసులు ప్రశ్నించగా తొలుత బుకాయించేందుకు ప్రయత్నించాడు. తన తల్లి టెర్రస్ వద్దకు ఎలా వచ్చిందో తెలియదని చెప్పాడు. చివరకు నిజాన్ని ఒప్పుకున్నాడు. పక్షవాతానికి గురైన తల్లికి చికిత్స అందించేందుకు చాలా ప్రయత్నించినట్లు తెలిపాడు. చాలా కాలంగా మంచానికి పరిమితమైన ఆమె బాధ చూడలేక ఇలా చేసినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో నిందితుడి మానసిక పరిస్థితితో పాటు ఆర్థిక అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Cop Kills Beggar | తాను మరణించినట్లుగా నమ్మించేందుకు.. బిచ్చగాడిని హత్య చేసిన డిస్మిస్ అయిన పోలీస్
Arvind Kejriwal | ‘కేజ్రీవాల్ కోర్టు విచారణ వీడియోలు తొలగించండి’.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

