Woman Cop Ties Granddaughter In Heat | మనవరాలిని గేటుకు కట్టేసి ఎండలో ఉంచిన పోలీస్ అధికారిణి.. సస్పెన్షన్
Woman Cop Ties Granddaughter In Heat | ఒక పోలీస్ అధికారిణి తన మనవరాలి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఐదేళ్ల బాలికను ఇంటి గేటుకు కట్టేసి మండుటెండలో వదిలేసింది. ఆ చిన్నారి ఏడ్వటాన్ని చూసి స్థానికులు కట్టు విప్పారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిణిని సస్పెండ్ చేశారు.
చండీగఢ్: ఒక పోలీస్ అధికారిణి తన మనవరాలి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఐదేళ్ల బాలికను ఇంటి గేటుకు కట్టేసి మండుటెండలో వదిలేసింది. ఆ చిన్నారి ఏడ్వటాన్ని చూసి స్థానికులు కట్టు విప్పారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిణిని సస్పెండ్ చేశారు. (Woman Cop Ties Granddaughter In Heat) పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఈ సంఘటన జరిగింది. ఏఎస్ఐ సరబ్జిత్ కౌర్, ఫరీద్‌కోట్‌లోని మహిళా సహాయ కేంద్రం (మహిళా మిత్ర) విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తన మనవరాలి పట్ల ఆమె దారుణంగా ప్రవర్తించింది. ఆ బాలికను ఇంటి గేటుకు కట్టేసింది. మండుటెండలో వదిలేసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి బాధతో ఏడ్వటాన్ని పొరుగువారు గమనించారు. ఆ బాలిక కట్లు విప్పి రక్షించారు. .
కాగా, పొరుగువారు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఏఎస్ఐ సరబ్జిత్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. చిన్నారిని హింసించడంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ బాలిక తల్లిదండ్రులు పోర్చుగల్‌లో నివసిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతను సరబ్జిత్ కౌర్‌కు అప్పగించినట్లుగా తెలిసిందన్నారు. పిల్లల సంరక్షణ కమిటీకి ఆ బాలికను అప్పగించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Cop Kills Beggar | తాను మరణించినట్లుగా నమ్మించేందుకు.. బిచ్చగాడిని హత్య చేసిన డిస్మిస్ అయిన పోలీస్
Arvind Kejriwal | ‘కేజ్రీవాల్ కోర్టు విచారణ వీడియోలు తొలగించండి’.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం
Watch: ఒక్క రోజు వయసున్న ఖడ్గమృగం పిల్ల.. అరుదైన వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- GATE
- granddaughter
- heat
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

